)
RIP Suravaram Sudhakar Reddy: కమ్యూనిస్టు ఉద్యమానికి దిక్సూచిగా.. పాలమూరు నుంచి జాతీయ స్థాయి కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి (83) అనారోగ్యంతో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతోపాటు అనారోగ్యానికి గురవడంతో ఆయన కొన్నాళ్లు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు సంతాపం ప్రకటించారు.
చికిత్స పొందుతూ..
అనారోగ్యానికి గురయిన సురవరం సుధాకర్ రెడ్డి అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం రాత్రి కన్నుమూశారు. నాటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొండ్రావుపల్లిలో జన్మించిన ఆయన 1998, 2004 లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. సురవరం సుధాకర్‌రెడ్డి మరణం కమ్యూనిజం లోకానికి తీరని లోటు.
కేసీఆర్‌తో ఎంతో అనుబంధం
సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 'పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితమంతా కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం. కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి పాత్ర పోషించి, మార్క్సిస్టు ప్రజా నాయకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు' అని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. శోకసంతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ హృదయపూర్వక సానుభూతి తెలిపారు.
'సీపీఐ అగ్ర నాయకులు, పార్లమెంట్ మాజీ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం ఎంతో బాధాకరం. ఆయన ప్రజాసేవ, ఉద్యమ పంథా చిరస్మరణీయం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. సురవరం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'
- హరీశ్ రావు, మాజీ మంత్రి
సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితమంతా కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం, కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి పాత్ర పోషించి, మార్క్సిస్టు ప్రజానేతగా… pic.twitter.com/JPecghGiLI
— BRS Party (@BRSparty) August 22, 2025
'సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మరణం యావత్ దేశానికి తీరని లోటు. తుదిశ్వాస వరకు నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకులుగా వారి నిబద్ధత, ఆచరణ భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'
- కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ
వైఎస్ జగన్ సంతాపం
సురవరం సుధాకర్‌రెడ్డి మృతికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. 'ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన సురవరం సుధాకర్‌రెడ్డి ప్రముఖ వామపక్షనేతగా గుర్తింపు పొందారు. ఏ పదవిలో ఉన్నా, తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేశారు' అని గుర్తు చేసుకున్నారు. అతడి మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని తెలిపారు.
CPI announces with profound grief the passing of our beloved former General Secretary, Comrade S. Sudhakar Reddy.
A lifelong fighter, he served as GS of CPI & twice represented Nalgonda in Lok Sabha. He will be remembered for his humility & commitment.
Red Salute, Comrade! pic.twitter.com/sGQmolJ5hA
— CPI - Communist Party of India (@CPI_National) August 22, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.