Beedi Worker To District Judge In USA: ఆయన కేరళలో సాధారణ జీవితంగా గడిపాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. బీడీ కార్మికుడిగా పనిచేశాడు. కూలీ పనులు చేస్తూనే.. మరోవైపు చదువును కొనసాగించాడు. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితం నుంచి ఏకంగా అగ్రరాజ్యం అమెరికాలో ఓ జిల్లాకు జడ్జిగా ఎదిగాడు. అమెరికాలో స్థిరపడిన కేరళ వాసి సురేంద్రన్ కె పటేల్ విజయగాథ ఇంది. టెక్సాస్‌ల ఫోర్ట్ బెండ్ కౌంటీలోని 240వ జ్యుడీషియల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. యూఎస్‌లో ఎన్నికల ద్వారా జిల్లా న్యాయమూర్తులు ఎంపిక చేస్తారు. 51 మంది ఎన్నికల మొదటి రౌండ్‌లో సిట్టింగ్ జడ్జిని ఓడించి యూఎస్‌లో జిల్లా న్యాయమూర్తి అయిన మొదటి మలయాళీ అయ్యారు ఆయన.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జడ్జి పదవికి చేపట్టడానికి ముందు పటేల్ ఎంతో కష్టపడ్డారు. అయితే ఆయన దృఢ సంకల్పం, కృషి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కసి ముందు అన్నీ చిన్నబోయాయి. సురేంద్రన్ కె పటేల్ కేరళలోని కాసరగోడ్‌లో పుట్టి పెరిగాడు. అక్కడ అతని తల్లిదండ్రులు రోజువారీ కూలీ కార్మికులు. సురేంద్రన్ కె పటేల్ చిన్ననాటి జీవితం కష్టాలతో నిండిపోయింది. పాఠశాలలో, కళాశాలలో చదువుతున్న సమయంలో కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేయాల్సి వచ్చేది. సురేంద్రన్ కూలీగా పని చేసి డబ్బు సంపాదించడానికి బీడీ ఫ్యాక్టరీలో పని చేయడం ప్రారంభించాడు. అక్కతో కలిసి బీడీలు కట్టేవాడు.


కూలీ పనులకు వెళ్లడంతో అటెండెన్స్ తగ్గింది. దీంతో పరీక్షలకు కాలేజీ యాజమాన్యం అనుమతించలేదు. తన పరిస్థితి వివరించడంతో పర్మిషన్ ఇవ్వగా.. ఆ పరీక్షల్లో టాపర్‌గా నిలిచారు. ఆ తరువాత కోజికోడ్‌లోని ఓ కళాశాలలో ఎల్‌ఎల్‌బీకి అడ్మిషన్ తీసుకున్నారు. ఒక హోటల్‌లో పని చేస్తూ.. 1995లో లా పాస్ అయ్యి నేరుగా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 


వృత్తిరీత్యా నర్సు అయిన శుభను వివాహం చేసుకున్నారు. ఆమెతో పాటు ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో లా ప్రాక్టీస్ చేశారు. 2007 సంవత్సరంలో ఆయన భార్యకు అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. దీంతో ఇద్దరు అమెరికా చేరారు. అక్కడ కొంతకాలం సూపర్ మార్కెట్‌లో పనిచేసిన తర్వాత అక్కడ టెక్సాస్ బార్ పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించారు. 2011లో యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌ఎం గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. అక్కడ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టి.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకొన్నారు. ఇటీవలె టెక్సాస్‌ల ఫోర్ట్ బెండ్ కౌంటీలో జడ్జీగా ఎన్నికై ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 


Also Read: Director Surender Reddy: షూటింగ్‌లో గాయపడిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. నొప్పిని సైతం లెక్కచేయకుండా..  


Also Read: India vs Sri Lanka: రాజ్‌కోట్‌లో సూర్య సునామీ.. బౌలర్ల మెరుపులు.. శ్రీలంక చిత్తు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook