Swami Nithyananda is alive kailasa desam clarity: స్వామి నిత్యానంద తనకు తానుగా దేవుడ్ని అని ప్రకటించుకున్నాడు. అంతే కాకుండా.. సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ సమీపంలో ఒక ద్వీపంను కొనుగోలు చేసి అక్కడ కైలాసదేశంను ఏర్పాటు చేసుకున్నాడు. ఆదేశానికి సొంత కరెన్సీ, వీసా, జెండాను కూడా ప్రత్యేకంగా ప్రకటించుకున్నాడు. అంతే కాకుండా.. తమ దేశాన్ని గుర్తించాలని కూడా ఐక్యరాజ్యసమితికి కైలాస దేశం నుంచి ప్రతినిధుల్ని సైతం నిత్యానంద పంపించడం అప్పట్లో సంచలనంగా మారింది.
ఈక్రమంలో నిత్యానంత తన దగ్గర ఉండే శిష్యురాలు.. రంజితతో రాసలీలు చేస్తు అడ్డంగాదొరికిపొయారు ఇది కాస్త వివాదాస్పదంగా మారడంతో అప్పటి నుంచి దేశం నుంచి పారిపోయి.. కైలాస దేశంను ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటున్నారు. అయితే.. తాజాగా.. స్వామి నిత్యానంద కొన్నిరోజులుగా కిడ్ని సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని.. ఆయన రెండు రోజుల క్రితం చనిపోయారని కూడా ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించారు. ఈ క్రమంలో దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. తమిళ్ , కన్నడ మీడియాలలో కూడా దీనిపై పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితమయ్యాయి.
చాలా మంది ఆయన భక్తులు, స్వామినిత్యానంద చనిపోయారని వస్తున్న వార్తలు చూసి నిజం అనుకున్నారు. ఇంకా ఆయన తర్వాత నాలుగువేల కోట్ల కైలాస దేశం సామ్రాజ్యానికి ఎవరు వారసులు అని కూడా జోరుగా చర్చలు కూడా జరిగాయి. ఈ క్రమంలో కైలాస దేశం ఈ రూమర్స్ పై స్పందించింది. స్వామి నిత్యానంద పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయన చనిపోయారని వస్తున్న వార్తలలో నిజంలేదన్నారు. దీంతో స్వామి నిత్యానంద చనిపోయారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
Read more: Nithyananda Death: నిత్యానంద స్వామి కన్నుమూత..?.. 4 వేల కోట్లకు ఆయన తర్వాత అధిపతి ఎవరో తెలుసా..?
మరోవైపు కొంత మంది కావాలని నిత్యానందను అప్రతిష్టపాలు చేసేందుకు.. భక్తుల్లో లేనీపోనీ భయాలు క్రియేట్ చేసేందుకుఈ విధంగా ఫెక్ వార్తల్ని వైరల్ చేస్తున్నారని కూడా కైలాస దేశం ప్రతినిధులు మండిపడ్డారు. నిత్యనంద ఇటీవల ఉగాది వేడుకల్లో పాల్గొన్న వీడియోలను సైతం కైలాసదేశం ప్రతినిధులు రిలీజ్ చేశారు. దీంతో ఇవన్ని ఫెక్ వార్తలని కూడా అందరికి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









