Tahawwur Rana: ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్న తహవూర్‌ రాణా.. డాక్టర్‌ నుంచి నరహంతకుడిగా ఎలా మారాడు?

Tahawwvur Rana History: ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ తహవూర్‌ రాణా నేడు ఎట్టకేలకు భారత్ చేరుకున్నాడు. యూఎస్‌ నుంచి ఒక ప్రత్యేక విమానంలో అతన్ని అధికారులకు ఇండియాకు తీసుకువచ్చారు. భారీ భద్రత మధ్య బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని ప్రస్తుతం తీహార్ జైలుకు తరలించే పనిలో ఉన్నారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 10, 2025, 03:27 PM IST
Tahawwur Rana: ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్న తహవూర్‌ రాణా.. డాక్టర్‌ నుంచి నరహంతకుడిగా ఎలా మారాడు?

Tahawwvur Rana History: ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన తహవూర్‌ రాణా భారత్ కి చేరుకున్నాడు. ఎట్టకేలకు యూఎస్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్లో అతన్ని అధికారులు ఇండియాకు తీసుకువచ్చారు. స్టాండ్‌బైగా అత్యంత సురక్షితమైన మార్క్స్‌మెన్‌ వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఇది ఎలాంటి దాడినైనా తట్టుకునే శక్తివంతమైంది. ప్రస్తుతం అత్యంత భారీ భద్రత నడుమ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తీహార్ జైలుకు తరలిస్తున్నారు. హై ప్రోఫైల్ వ్యక్తులు, ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్‌లను మాత్రమే తరలించేందుకు ఈ వాహనం ఉపయోగిస్తారు. తహవూర్‌ రాణాను ప్రధానంగా విమానాశ్రయంలో దిగగానే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లోకి అతడిని షిఫ్ట్ చేసి సాయుధ బలగాల స్పెషల్ అండ్ టాక్టిక్స్ కమాండోల రక్షణతో ట్రాఫిక్ క్లియర్ చేస్తూ కాన్వాయ్‌లో అతన్ని తీసుకెళ్లారు. అయితే 26/11 కుట్ర దారుల్లో ఒకటైన రాణా ఇస్లామాబాద్ వాసి వైద్యుడి నుంచి నరహంతకుడిగా ఎలా మారాడో అతని గురించి ఈరోజు తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ముంబై ఉగ్ర దాడి సూత్రధారి అయిన తహవూర్‌ హుస్సేన్ రాణా ఒక వైద్యుడు. అంతకుమించి పాకిస్తానీ పౌరుడు కాబట్టి మతోన్మాదుడు కూడా. ఈ నేపథ్యంలోనే అతడు జీవితాంతం జైల్లో గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇతను పాకిస్తాన్ పంజాబ్ ప్రోవిన్స్‌లోని సాహివాల్ జిల్లాలో జన్మించాడు. అయితే అతడికి ఎప్పటి నుంచో భద్రత సేవలో చేరాలనే కోరిక ఉండేది. కానీ తన తండ్రి పట్టుదలతో వైద్య వృత్తి కొనసాగించాల్సి వచ్చింది. ఎట్టకేలకు మెడికల్ పూర్తిచేసి పాకిస్తాన్ సైన్యం మెడికల్ కార్ప్స్‌లో చేరాడు.అక్కడి నుంచి ఉగ్రచర్యలు మరింత ఊపందుకున్నాయి.

READ ALSO:  స్కూళ్లకు ఆరోజు నుంచే వేసవి సెలవులు.. అధికారికంగా  ప్రకటించిన ప్రభుత్వం..!    

ఈ సమయంలోనే అతనికి ఐఎస్ఐ అధికారులతో కూడా సంబంధం ఏర్పడింది. అయితే ఇతనికి వైద్య వృత్తిలో పట్టా ఉండడంతో కెనడాకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ నిఘా సంస్థలతో సంప్రదింపులు జరిపాడు. అక్కడి నుంచి కూడా చికాగో వెళ్లాడు, అక్కడ ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి ఒక సొంత సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఆ సమయంలోనే అమెరికాకు చెందిన డేవిడ్ హెడ్లీ కూడా పరిచయం అయ్యాడు. అయితే, ఆయన పూర్తి చేసింది వైద్య వృత్తి కానీ ఎప్పుడు విలాసవంతమైన జీవితం అనుభవించాలని కోరుకునేవాడు. ఆశ మరింత పెరిగింది ఒకానొక సమయంలో తన భార్యతో కలిసి అతడు భారత్ పర్యటించాడు.

READ ALSO:   ఘోర ప్రమాదం.. నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలి 184 మంది మృత్యువాత, వీడియో చూడండి..

ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఆగ్రా, కేరళ, గుజరాత్, అహ్మదాబాద్, ముంబై వంటి ప్రాంతాలలో కొన్ని రోజులు గడిపాడు. అయితే ఎప్పటి నుంచో మతోన్మాదం, దురాశ కలిగి ఉండే రాణా ముంబై ఉగ్ర దాడికి సూత్రదారుడు అయ్యాడు. డేవిడ్ హెడ్లితో ఆ ముంబైలోని ఫస్ట్ వరల్డ్ అనే కార్యాలయాన్ని కూడా తెరిపించాడు. అందులో ఉగ్రవాదులను కార్యకలాపాలు కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ముంబై ఉగ్రదాడిలో పక్కా ప్లాన్ తో పదిమంది హోటల్లోకి చొరబడి దాడులు జరిపారు. అయితే 2019 నుంచి తహవూర్‌ను తమకు అప్పగించాలని భారత్ యూఎస్‌ను కోరుతూనే ఉంది. ఈ ముంబై ఉగ్రదాడిలో 174 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News