Tahawwur Rana 18 Days Custody: ముంబై కుట్రకు ప్రధాన సూత్రధారి అయిన తహవ్వూర్ రాణాను నిన్న యూఎస్ నుంచి ఇండియాకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాణాలను ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరచగా అతనికి 18 రోజుల కస్టడీకి పంపించారు. ప్రధానంగా 2008 ముంబై దాడుల వెనుక ఇతను కుట్ర కోణం ఉందని ప్రశ్నిస్తున్నారు. ఈ ముంబై ఉగ్రదాడిలో దాదాపు 166 మంది చనిపోగా 238 మందికి పైగా గాయపడ్డారు.
అయితే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే ఎన్‌ఐఏ బృందం అతన్ని పాటియాలా కోర్టుకు తీసుకువెళ్లారు. ప్రధాన న్యాయమూర్తి ముందు హాజరు పరిచిన తర్వాత 18 రోజుల ఎన్‌ఐఏ కస్డడీకి అప్పగించింది కోర్టు. అయితే ముంబైతో పాటు ఇతర కుట్ర కోణాలపై కూడా నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉందని ఎన్ఐఏ, NSG బృందాలు భావిస్తున్నాయి. అయితే ఎన్నో రోజులుగా యూఎస్ ని రాణాను ఇండియాకి అప్పగించాలని కోరింది భారత్. ఎట్టకేలకు నిన్న యూఎస్ సుప్రీంకోర్టు అతడు అప్పీల్ ని రిజెక్ట్ చేయడంతో ఇండియాకి అప్పగించారు.
ఇక తహవ్వూర్ రాణాకు సంబంధించిన ఫస్ట్ ఫోటో కూడా విడుదల చేశారు. అయితే ఆయన ఎన్‌ఐఏ అదుపులో ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటోలో తహవర్ హుస్సేన్ రాణాను వెనుక వైపు నుంచి ఫోటో తీశారు. రాణా పాకిస్తాన్‌కు చెందిన వైద్యుడు. కొన్ని రోజులు అక్కడి భద్రత బలగాలతో కూడా పనిచేశాడు. ఆ తర్వాత ఇతడు అమెరికన్ టెర్రరిస్ట్ అయిన డేవిడ్ కాల్ మాన్ హెడ్లితో కలిసి ముంబై దాడులు తెగబడ్డాడు.
READ ALSO: జియో డైలీ 1 జీబీ డేటా.. అపరిమిత వాయిస్ కాలింగ్ ఎంత చీపో తెలుసా?
పాకిస్తాన్ నుంచి డాక్టర్ పట్టా పొందిన రాణా కెనడా వెళ్ళాడు. అక్కడి నుంచి చికాకు వెళ్లి ఒక ఇమిగ్రేషన్ సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో పాటు ముంబైలోని హెడ్లీతో శాటిలైట్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేశాడు. అక్కడి నుంచి 2006 నుంచి 2008 మధ్యలో టెర్రరిస్టు చర్యలు కొనసాగించి ముంబై దాడులకు కుట్రపన్నాడు. అయితే పీఎం మోదీ ఫిబ్రవరిలో యూఎస్ వెళ్ళిన తర్వాత జరిగిన చర్చల్లో రాణాను ఇండియాకి అప్పజెప్పడం జరిగింది.
READ ALSO: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారు ఆరోగ్యంపై జాగ్రత్త, ఓ సమస్య నుంచి గట్టేక్కుతారు..
ఇక కేంద్ర మంత్రి అమిత్ షా కూడా రానా ను ఇండియాకు అప్పజెప్పడం అనేది నరేంద్ర మోడీకి సారథ్యంలో ఇది ఒక గొప్ప విజయమని కొనియాడారు. మన దేశంతోపాటు ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని ఇండియాకి తీసుకురావడం జరిగిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









