Summer Precautions: వేసవికాలంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకు గండం

Take These Precautions Amid Heat Waves: అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలు వేసవికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండ వేడిమితో అనారోగ్యానికి గురవడమే కాకుండా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎండ నుంచి రక్షణకు ఈ జాగ్రత్తలు పాటిద్దాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 29, 2025, 04:12 PM IST
Summer Precautions: వేసవికాలంలో ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకు గండం

Heat Waves Precaution Tips: వేసవికాలం తీవ్ర రూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పగలు, రాత్రి వేడితో అల్లాడిపోతున్నారు. యావత్‌ భారతదేశం మొత్తం దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. వేసవి తాపం తట్టుకోలేక ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. అయితే వేసవికాలం విద్యుత్‌ ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉంది. విద్యుత్‌ ప్రమాదాలతోపాటు మన ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ వేసవి జాగ్రత్తలు తీసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Telangana Weather: రానున్న 5 రోజులు తస్మాత్ జాగ్రత్త, తీవ్రమైన ఎండలు, ఆరెంజ్ అలర్ట్ జారీ

వేసవికాలం అధిక ఉష్ణోగ్రతలతో వేడి మండిపోతోంది. ఈ సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో విద్యుత్ లీకేజీ, సిలిండర్ ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. ప్రజలు భద్రతా చర్యలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు.

ఎండ నుంచి రక్షిణకు జాగ్రత్తలు

  • మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి నిత్యం నీరు తాగుతుండాలి. ప్రయాణ సమయంలో తాగునీటిని తీసుకెళ్లాలి. ఓఆర్ఎస్, నిమ్మరసం, తాగునీరు, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలి.
  • వేసవికాలం మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. వీలైనంత ఇంటి ఆహారం తీసుకోవాలి. ఆహారంలో కూరగాయలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
  • వేసవికాలంలో ఉదయం, సాయంత్రం మినహా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లరాదు. అత్యవసరమైతే మినహా మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.
  • బాగా వెలుతురు, చల్లని ప్రదేశాలలో ఉండాలి. సన్నని, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి.
  • బయటకు వెళ్లేటప్పుడు బూట్లు ధరించాలి. ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
  • పగటిపూట బయటకు వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లాలి. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు వాహనాల్లో ఒంటరిగా వదిలివేయకూడదు. గర్భిణీ స్త్రీలపై అదనపు శ్రద్ధ వహించాలి. 

Also Read: BRS Party: 'మీక్కావాల్సింది ఇదేగా.. ఇగ చూసుకోరి'.. జోష్‌ పెంచిన కేసీఆర్‌ ప్రసంగం

వృద్ధులకు ప్రత్యేక జాగ్రత్తలు
ఒంటరిగా నివసించే వృద్ధుల ఆరోగ్యాన్ని రోజుకు రెండుసార్లు తనిఖీ చేయాలి. వృద్ధుల దగ్గర టెలిఫోన్ ఉండేలా చూసుకోండి. వృద్ధులు వేడి ఒత్తిడితో బాధపడుతుంటే వారి మెడ, చేతులపై తడి బట్టతో తుడిచి చల్లటి నీటితో స్నానం చేయాలి. తగినంత వ్యవధిలో నీరు తాగాలని నిర్ధారించుకోండి.

పశువుల సంరక్షణ
పశువులకు నీడనిచ్చే పైకప్పును నిర్మించి ఇతర సౌకర్యాలు కల్పించండి. పశువులకు తగినంత నీరు అందించాలి. పశువులకు మేత బహిరంగ ప్రదేశాల్లో పెట్టవద్దు. పరిమిత ప్రదేశాలలో పశువులను కట్టవద్దు. పక్షులకు నీడ కల్పించాలి. నీరు అందుబాటులో ఉంచాలి. పెంపుడు జంతువులను వాహనాల్లో బంధించి ఉంచవద్దు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News