Khushbu Reacts on Tamil nadu girl periods issue: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా కినత్తుకడవై లో ఇటీవల అమానవీయకర ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు పీరియడ్స్ వచ్చాయి. దీంతో ఆమెకు స్కూల్ లో ఆరుబైట కూర్చోబెట్టి మరీ ఎగ్జామ్ రాయించారు. అయితే.. దీనిపై బాలిక తల్లి స్కూల్ కు వచ్చి వీడియో తీసి పాఠశాల యాజామాన్యంను ప్రశ్నించింది. వారు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతొ సోషల్ మీడియాలో ఈ ఘటనను పోస్ట్ చేసింది.
దీంతో అది కాస్త వైరల్ కావడంతో దీనిపై విద్యాశాఖ, జిల్లా అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.ఈ క్రమంలో అధికారులు ఆ స్కూల్ కు వచ్చి విచారణ చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఈనెల 5న రజస్వల అయ్యింది.ఆతర్వాత 7,9 వతేదీల్లో ఆమెకు స్కూల్ లో ఫైనల్ ఎగ్జామ్ లను నిర్వహించారు. అయితే.. బాలిక తమ పిల్లలతో కలిస్తే.. అంటు (ముట్టు) అవుతుందని.. మిగత స్టూడెంట్స్ వాళ్ల తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారని, దీంతో చేసేది లేక.. సిబ్బంది ఆరుబైట కూర్చొబెట్టి ఎగ్జామ్ రాయించామని స్కూల్ సిబ్బంది స్పష్టం చేశారు.
అయితే.. దీనిలో తమ తప్పులేదని స్కూల్ సిబ్బంది క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో అసలు.. ఒక అమ్మాయిని ఇలా చేయడం వివక్ష కిందకు రాదా.. అని సదరు అధికారులు స్కూల్ సిబ్బందికి కౌంటర్ ప్రశ్నలు వేశారు. దీంతొ పొంతన లేని సమాధానం చెప్పడంతో.. హెచ్ ఎంను సస్పెండ్ చేశారు. అదే విధంగా దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకొవాలని ఆదేశించారు.
అయితే.. దీనిపై తాజాగా.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సైతం స్పందించారు. అసలు.. మీరు మనుషులేనా.. మనం ఇంకా ఏ యుగంలో ఉంటున్నామని ఎమోషనల్ అయ్యారు. నెలసరి అనేది చాలా సాధారణ ప్రక్రియ. మానసిక పరిపక్వత లేకుండా.. ఇంత నీచంగా ప్రవర్తిస్తారా.. అంటూ ఖుష్బు దీనిపై మండిపడ్డారు. ఇలాంటి వాటికి పాల్పడిన వారికి సరైన విధంగా బుద్ది చెప్పాలని కూడా నటి ఖుష్బూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









