Tamil Nadu Govt TET: 1 నుంచి 8 తరగతులు బోధిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో టెట్ పరీక్షలో అర్హత సాధించని ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 2026లో మూడుసార్లు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షలను నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం వచ్చే ఏడాది జనవరి, జూలై, డిసెంబర్ నెలలో మూడుసార్లు ప్రత్యేక TET నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఉపాధ్యాయులకు టెట్‌కు అర్హత సాధించేందుకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వాలని జిల్లా విద్యా, శిక్షణ సంస్థలు (DIETలు)ను ఆదేశించింది.
సుప్రీంకోర్టు తీర్పు తరువాత దాదాపు 1.75 లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి విద్య హక్కు చట్టం 2009 ప్రకారం.. 1 నుంచి 8 తరగతుల వరకు బోధించే సెకండరీ, గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు టెట్‌కు అర్హత సాధించాలని సుప్రీం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1, 2025 నుంచి రెండేళ్లలోపు TETకు అర్హత సాధించని ఉపాధ్యాయులు తప్పనిసరిగా పదవీ విరమణ చేసి.. సర్వీసు నుంచి తొలగిస్తామని ఆదేశించింది. తమిళనాడులో చాలా మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడడంతో ప్రభుత్వం దీపావళి ముందు తీపి కబురు అందించినట్లయింది.
తమిళనాడులో వచ్చే ఏడాది మూడు ప్రత్యేక TET నోటిఫికేషన్లు జారీ చేయడానికి ఉపాధ్యాయ నియామక బోర్డు (TRB)కి అనుమతి లభించింది. ఫలితాలను సమీక్షించి.. ఇంకా టెట్‌కు ఇంకా అర్హత సాధించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్యను అంచనా వేసిన తర్వాత 2027లో అదనపు పరీక్షలను నిర్వహించనుంది తమిళనాడు ప్రభుత్వం. 2012 నుంచి తమిళనాడులో ఆరు టెట్‌లను నిర్వహించగా.. మొత్తం 37.28 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1,67,985 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
సుప్రీం ఆదేశాల ప్రకారం.. పదవీ విరమణ చేయడానికి 5 సంవత్సరాల కంటే తక్కువ సమయం ఉన్న ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరికాదు. టెట్ పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోయినా.. పదవీ విరమణ వయస్సు వరకు విధులు నిర్వర్తించవచ్చు. అయితే వారు పదోన్నతి పొందాలనుకుంటే మాత్రం టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఉపాధ్యాయులకు భారీ ఉపశమనం కలగనుంది. ఈ మూడు అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుని.. అందరు ఉపాధ్యాయులు TET పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: EPFO New Rules: డబ్బులు అవసరం ఉన్నాయా? ఈపీఎఫ్ నుంచి సింపుల్‌గా ఇలా విత్‌డ్రా చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









