Vijay vs PK: తమిళనాట విజయ్ కొత్త వ్యూహం, ఎన్నికల వ్యూహకర్తగా పీకే

Vijay vs PK: తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు పోటీగా మరో పార్టీ ఎంట్రీ ఇచ్చింది. తమళ సూపర్ స్టార్ నటుడు దళపతి విజయ్ పార్టీ వ్యూహాత్మకంగా బరిలో దిగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 10, 2025, 08:15 PM IST
Vijay vs PK: తమిళనాట విజయ్ కొత్త వ్యూహం, ఎన్నికల వ్యూహకర్తగా పీకే

Vijay vs PK: తమిళనాడు రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. ప్రతి ఐదేళ్లకు అధికారం మారిపోతుంటుంది. కొత్తగా తమిళగ వెట్రిగ కజగం పేరుతో టీవీకే పార్టీ స్థాపించిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ పూర్తి స్థాయిలో బరిలో దిగుతున్నారు. పూర్తి సమయం ఇకపై రాజకీయాలేనని ప్రకటించారు. అందుకు తగ్గట్టే ఎన్నికల వ్యూహకర్తను నియమించుకుంటున్నారని తెలుస్తోంది. 

Add Zee News as a Preferred Source

దేశంలో ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకేతో దళపతి విజయ్ జట్టు కట్టనున్నారని తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇప్పట్నించే తన టీవీకే పార్టీని సిద్ధం చేస్తున్నారు. పార్టీ బలోపేతం చేయడం, ఎన్నికల వ్యూహాలు రచించడం, ప్రజల్లో పార్టీ సిద్ధాంతాల ప్రచారం చేసేందుకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌‌ను నియమించుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే పీకేతో సంప్రదింపులు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఐప్యాక్ వదిలేసి బీహార్ రాజకీయాలపై దృష్టి సారించిన పీకే వ్యక్తిగతంగా ఏపీలో తెలుగుదేశం పార్టీకు సలహాలు సూచనలు ఇచ్చారు. అంతకంటే ముందు అంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి పార్టీ భారీ విజయానికి కారణమయ్యారు. అటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ మూడోసారి అధికారంలో వచ్చేలా ప్రయత్నించారు. 

ప్రస్తుతం దళపతి విజయ్, ప్రశాంత్ కిశోర్ మధ్య కేవలం సంప్రదింపులు మాత్రమే జరిగాయి. ఇంకా అధికారికంగా ఒప్పందం జరగలేదు. దళపతి విజయ్ కోసం పనిచేసేందుకు కొత్తగా మరో సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. దళపతి విజయ్ రాజకీయ ప్రస్థానం కోసం పీకే ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్ తరహాలో తమిళనాడులో భారీ పాదయాత్ర చేసే ఆలోచనలో విజయ్ ఉన్నారని తెలుస్తోంది. 

Also read: Earth Viral Video: తలకిందులవుతున్న భూమి, భూ భ్రమణం వీడీయో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News