South Indian Movement: ఓవైపు జాతీయ విద్య విధానంలో హిందీ భాష అమలు, మరో వైపు డీలిమిటేషన్ వ్యవహారంలో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై తమిళనాడులో ఉద్యమం తీవ్రమౌతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వం వహిస్తుండటంతో ఆసక్తి రేపుతోంది. క్రమంగా దక్షిణాదిని ఉద్యమం విస్తరింపచేసే ప్రణాళికలో స్టాలిన్ ఉన్నారు.
జాతీయ విద్య విధానంలో హిందీ కాకుండా ఇంగ్లీషు, తమిళం భాషలతో ద్వి భాష విధానంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పట్టుబడుతున్నారు. ఇదే విషయమై కేంద్రంతో పేచీకు దిగారు. హిందీ వ్యతిరేక ఉద్యమం తీవ్రతరం చేస్తున్నారు. దీనికి తోడు త్వరలో జరగనున్న డీలిమిటేషన్ కూడా దక్షిణాది ఆధిక్యతను పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తోందని స్టాలిన్ ఆవేదనం చెందుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీ లిమిటేషన్ వంకతో ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య గణనీయంగా పెంచుకోవాలని చూడటం దక్షిణాదికి విలువ లేకుండా చేయడమేననేది స్టాలిన్ అభిప్రాయం.
ఎవరెవరు హాజరు కావచ్చు
హిందీ వ్యతిరేక ఉద్యమం, దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సీఎం స్టాలిన్ నడుం బిగించారు. అందరూ ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ నెల 22న చెన్నైలో సమావేశం నిర్వహించనున్నారు. దక్షిణాది కీలక నేతలకు పిలుపునిచ్చారు. కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం పంపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ లకు ఆహ్వానం పంపించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్టాలిన్ విధానాన్ని సమర్థిస్తోంది. డీఎంకేతో పాటు కూటమి పార్టీలో కాంగ్రెస్ భాగస్వామి. కానీ రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు తక్కువే. ఎందుకంటే కేసీఆర్ ఈ సమావేశానికి హాజరు కానుండటం కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందనేది అసలు ప్రశ్న.
ఇక దక్షిణాదికి అన్యాయం జరగకుండా బాధ్యత తీసుకుంటానన్న చంద్రబాబు ఎన్డీఏలో కీలకంగా ఉండటంతో ఆయన హాజరవుతారా లేదా అనేది సందేహమే. ఇక వైఎస్ జగన్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కావచ్చని తెలుస్తోంది. ఎందుకంటే స్టాలిన్ వర్సెస్ జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ఆధారంగా జరగనుండటం దక్షిణాదికి శాపంగా మారనుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో జనాభా నియంత్రణ గణనీయంగా తగ్గింది. ఫలితంగా డీ లిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం లోక్‌సభలో పడిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరుగుతాయి. అందుకే స్టాలిన్ మొదలుపెడుతున్న ఉద్యమంపై అందరికీ ఆసక్తి కలుగుతోంది. ఎవరెవరు ఎలాంటి మద్దతు ఇస్తారు, ఉద్యమం ఏ రూపు దాలుస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
Also read: EPFO Services In ATM: ఈపీఎఫ్ సభ్యులకు శుభవార్త.. భవిష్యత్‌లో ఏటీఎం నుంచి సేవలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









