Supreme Court: ముదురుతున్న తమిళ హిందీ వివాదం, సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ

Supreme Court: తమిళనాట హిందీ వివాదం రోజురోజుకూ పెరుగుతోంది. తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. జాతీయ విద్యా విధానంపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2025, 11:10 PM IST
Supreme Court: ముదురుతున్న తమిళ హిందీ వివాదం, సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ

Supreme Court: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో కేంద్రంతో పంచాయితీ మొదలైంది. ఈ విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలును తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే వివాదానికి కారణమైంది. 

Add Zee News as a Preferred Source

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంలో ఇమిడి ఉన్న త్రిభాషా విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఆ స్థానంలో తాము తమిళం, ఇంగ్లీషు ద్విభాషా విధానం అమలు చేస్తామని చెబుతోంది. హిందీ భాషను తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. తాము కోరుకునేది భాషా సమానత్వమేనని..అంతమాత్రానికే విమర్శించడం మంచిది కాదని స్పష్టం చేశారు. తమిళనాడులో తమిళ భాషకు ప్రాధాన్యత కల్పించమని అడుగుతున్నామన్నారు. తమిళ భాషకు ప్రాధాన్యత కోసం అడుగుతుంటే దురభిమానం, పక్షపాతం అనే ముద్రలు వేస్తున్నారని ఎంకే స్టాలిన్ విమర్శించారు. 

గాడ్సే భావజాలాన్ని కీర్తించే వ్యక్తులు..చైనా దురాక్రమణ, కార్గిల్ యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తికై జరిగి యుద్ధాలకు నిధులు అందించిన డీఎంకేకు ఉన్న దేశభక్తిని ప్రశ్నిస్తున్నారని బీజేపీకు చురకలంటించారు. హిందీని బలవంతంగా హిందీయేతర ప్రాంతాలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని డీఎంకే ప్రభుత్వం మండిపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల్ని కూడా నిలిపివేశారని మండిపడ్డారు. 

ఇదిలా ఉండగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జాతీయ విద్యా విధానం అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ విధానం అమలు చేయమని సుప్రీంకోర్టు నేరుగా బలవంతం చేయలేకపోయినా, రాజ్యాంగ నిబంధనలు లేదా చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానానికి ఉంటుందని పిటీషనర్ వాదించారు.

Also read: Heera Gold Scam: మూడు నెలల్లో 25 కోట్లు చెల్లించకుంటే మళ్లీ జైలే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News