TCS Employee Wife Video: రోజు తాగోచ్చి ఆ పని.. టీసీఎస్ భర్త గురించి షాకింగ్ నిజాలు బైటపెట్టిన భార్య.. వీడియో వైరల్..

Tcs employee manav sharma suicide: మానవ్ శర్మ ఇటీవల భార్య వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక వీడియోను రిలీజ్ చేసి మరీ చనిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు మండి పడుతున్నారు. భార్యల బారి నుంచి భర్తలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 28, 2025, 05:30 PM IST
  • భార్యతో గొడవ పడి టెకీ ఆత్మహత్య..
  • వీడియో రిలీజ్ చేసిన మహిళ..
TCS Employee Wife Video: రోజు తాగోచ్చి ఆ పని.. టీసీఎస్ భర్త గురించి షాకింగ్ నిజాలు బైటపెట్టిన భార్య.. వీడియో వైరల్..

Tcs employee manav sharma suicide incident: ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన ఫెమస్ ఐటీ కంపెనీ టీసీఎస్ లో రిక్రూటర్ మానవ్ శర్మ కు గతేడాది నికితా శర్మతో 2024 లో వివాహాం జరిగింది. పెళ్లైన కొన్నిరోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఉద్యోగం కోసం.. మానవ్ శర్మ ముంబైకు వెళ్లారు. అయితే.. గతంలో తన భార్యకు ఇతరులతో లవ్ ఎఫైర్ ఉందన్న విషయం బైటపడింది.

Add Zee News as a Preferred Source

దీంతో అతను.. తరచుగా భార్యతో గొడవలకు దిగేవాడు. తాగి వచ్చి భార్యతో వాగ్వాదం చేసుకునే వాడు. ఈ క్రమంలో ఇటీవల తన భార్యను తీసుకొచ్చి ఆగ్రాలో ఆమె పుట్టింట్లో వదిలేశాడు. ఆతర్వాత మరల ముంబైకు వెళ్లిపొయాడు. ఈ క్రమంలో మానవ్ శర్మ.. తన భార్యపెడుతున్న టార్చర్ ను ఒక వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. మగాళ్లకు చట్టాలు అన్ని అపోజిట్గా ఉన్నాయని.. దయచేసి వీటిని మార్చాలని కూడా వేడుకున్నాడు. తన తల్లిదండ్రులు, సోదరికి సారీ చెప్పాడు. తన వాళ్ల జోలికి రావొద్దని కూడా వీడియోలో వేడుకున్నాడు.

 

తన భార్య టార్చర్ భరించలేక పోతున్నానని.. ఇక సెలవు అని చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. గతంలో ఇలాంటి ఘటనలు వార్తలలో నిలిచాయి.

ఈ ఘటనపై మానవ్ శర్మ వైఫ్ నిఖిత రియాక్ట్ అయ్యింది. చనిపోయిన తన భర్త వీడియోలో చేసిన ఆరోపణల్ని ఖండించింది. మానవ్ శర్మ.. రోజు తాగి వచ్చి తనను వేధించేవాడని, కొరికే వాడని, దాడులు సైతం చేశాడని చెప్పింది... తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయన్న విషయంలో నిజంలేదని చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందు జరిగిన కొన్ని విషయాల్ని పట్టుకుని కావాలని ప్రతిరోజు టార్చర్ చేసేవాడని కూడా చెప్పింది.

 

తన అత్తామామలకు కూడా దీనిపై అనేక సందర్భాలలో చెప్పానని, కానీ వాళ్లు పెద్దగా పట్టించుకోలేదని కూడా చెప్పింది. దీనిపై ప్రస్తుతం వస్తున్న ఆరోపణలన్ని అవాస్తవమని తెల్చి చెప్పింది. తన  భర్త చనిపోయిన తర్వాత.. కొన్నిరోజులకు తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని.. తనపై దాడి చేశారని మహిళ వాపోయింది.   

Read more: Uttarakhand Avalanche: ఉత్తరా ఖండ్‌లో మంచు ప్రళయం.. రంగంలోకి దిగిన సీఎం పుష్కర్ సింగ్ ధామి.. ఏమన్నారంటే..?

అంతే కాకుండా.. తనపై చేస్తున్న ఈ ఆరోపణల్లో ఏమాత్రం కూడా నిజంలేదని నికితా శర్మ స్పష్టం చేసింది. నికితా శర్మ మాట్లాడిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News