Telangana Cabinet: కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధం, ఆ మంత్రికి ఉద్వాసన ఖాయం

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాదాపు ఏడాదిగా మంతివర్గ విస్తరణపై చాలా చర్చలు జరిగాయి. ఢిల్లీ అధిష్టానం తుది జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2025, 03:37 PM IST
Telangana Cabinet: కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధం, ఆ మంత్రికి ఉద్వాసన ఖాయం

Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గం విస్తరణ గురించి దాదాపు ఏడాదిగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇతర ప్రముఖులు ఢిల్లీ అధిష్టానంతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. ఇప్పుడిక ఆలస్యం చేయకుండా కేబినెస్ విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ దాదాపుగా లభించిందని తెలుస్తోంది. 

Add Zee News as a Preferred Source

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది. ఢిలీ నుంచి దాదాపు ఏడాది కాలంగా వివిధ కోణాల్లో చర్చల అనంతరం కేబినెట్ విస్తరణతో పాటు టీపీసీసీ కమిటీ నియామకాలు చేపట్టేందుకు అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఇద్దరిపై వేటు పడవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో కొత్తగా విజయశాంతికి అవకాశం లభించవచ్చని విన్పిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ జాబితా సిద్ధమైందని, అధికారికంగా ప్రకటన ఎప్పుడైనా రావచ్చని అంటున్నారు. వివిధ సామాజిక సమీకరణాలు, ప్రాంతాలు, పార్టీ పటిష్టతను దృష్టిలో ఉంచుకుని ఐదుగురికి స్థానం కల్పించనున్నారు. 

ఐదుగురిలో ఒకటి రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడం ఖాయంగా తెలుస్తోంది. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కూడా అవకాశం లభించవచ్చు. మంత్రులుగా తొలగించినవారికి మాత్రం పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో పరువు పోగొట్టుకున్న ఓ మంత్రిని తప్పించడం ఖాయమని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతిని, నల్గొండ నుంచి రేవంత్ రెడ్డి సన్నిహితుడు అద్దంకి దయాకర్‌ను మంత్రివర్గంలో తీసుకోవచ్చు. అయితే నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి పేరు కూడా రేసులో ఉంది. 

ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ ఢిల్లీలో పార్టీ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం తుది నిర్ణయం తీసుకోవచ్చు. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నందున ఈలోగా మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు.

Also read: Telangana Cabinet: ఉద్యోగుల డిమాండ్లకు గ్రీన్‌సిగ్నల్, రేపే కేబినెట్ భేటీ>

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News