AICC Meeting: దేశంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తర్వాత అత్యంత సుధీర్ఘ కాలం అధికారానికి దూరంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది గుజరాత్ అని చెప్పాలి. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ రాష్ట్రం బీజేపీకి కంచుకోటగా ఉంది. 90వ దశకం నుంచి అక్కడ భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యం వహిస్తోంది. అంతేకాదు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడ ఆ పార్టీని కదిలించే పరిస్థితి లేదు. ఆ మధ్య ఓ ఎన్నికల ముందు గుజరాత్ లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ముచ్చమటలు పట్టించింది.
ఆ సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారిన గుజరాత్ రాష్ట్రంలో దాదాపు 64 యేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను నిర్వహించడం ఆసక్తి రేపుతోంది.ఇందుకుగాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఆహ్మదాబాద్ కు వెళ్ళనున్నారు. ఈ మీటింగ్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44 మంది నేతలకు ఆహ్వానం అందింది. జాతీయస్థాయిలో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశాల్లోనే కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ వివరించనున్నారని తెలుస్తోంది. కాగా రెండు రోజుల పాటు జరిగే సమావేశాల్లో, సుమారు 1200 మంది ఏఐసీసీ సభ్యులతో పాటు, మొత్తం 1500 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో మాత్రమే అధికారంలో ఉంది. మరోవైపు తమిళనాడు, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ లో కూటమిగా అధికారంలో కొనసాగతుంది.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









