National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిందితులుగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ తో పాటు కొంత మంది కాంగ్రెస్ నేతల పేర్లను కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. అయితే వీరిని నిందితులుగా చేర్చలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతోపాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయడానికి కుట్ర జరిగినట్లు ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) అభియోగాలు మోపింది. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ఆస్తులను కాజేయాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా సంస్థను స్థాపించినట్లు వెల్లడించింది. ఈ సంస్థ ఏర్పాటుకు పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు ఇతరులు 2019–22 మధ్య విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చినట్లు తెలిపింది.
అందుకు ప్రతిఫలంగా పదవులు, ప్రయోజనాలు కట్టబెడతామని ప్రస్తుత తెలంగాణ సీఎం, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పవన్ బన్సల్, అహ్మద్ పటేల్ ప్రలోభ పెట్టారని ఈడీ తన చార్జిషిట్‌లో పేర్కొంది. సాక్షులను విచారించిన తర్వాతే ఈ విషయం నిర్ధారించుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటు కోసం రూ.30 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చానని కాంగ్రెస్ నేత అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఈడీ విచారణలో అంగీకరించారు. అహ్మద్ పటేల్ సూచన మేరకే ఈ డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్‌కుమార్‌కు కూడా నోటీసులిచ్చి విచారించింది.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఏకైక టీవీ సీరియల్ గురించి తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: కేవలం 5 నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే వంటింటి చిట్కా.. అసలు మిస్ కావొద్దు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.