Telangana New BJP chief: తెలంగాణ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడు నియమించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వచ్చి మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ త్వరలో తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి వరించబోతుందని ప్రచారం జరుగుతుంది. కానీ అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరలా బండి సంజయ్ తోపాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్ ఎంపీ మాజీ మంత్రి డీకే అరుణతో పాటు.. వకీల్ సాబ్.. మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు బీజేపీ తరుపున ఎమ్మెల్సీ బాధ్యతలు నిర్వహించిన ఎన్.రామచందర్ రావు పేర్లు కూడా ప్రస్తావన కు వచ్చాయి.
ఇక తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్టు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా బీజేపీ తెలంగాణ సీనియర్ లీడర్.. గతంలో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేద్దామనుకున్న.. హైకమాండ్ ఆదేశాల మేరకు ఈటల కోసం పక్కకు తప్పుకున్న కర్ణాటక, మధ్యప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గా పనిచేసిన మురళీధర్ రావుకు బీజేపీ తెలంగాణ పగ్గాలు అప్పగించాలనే నిర్ణయానికి బీజేపీ కేంద్ర పెద్దలు వచ్చినట్టు తెలుస్తుంది.
మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూన్న కిషన్ రెడ్డికి నడ్డా స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు కేంద్ర క్యాబినేట్ విస్తరణలో ఈటలను కేంద్ర సహాయ మంత్రిగా తీసుకోనున్నారు. మరోవైపు బండి సంజయ్ కు కేంద్ర క్యాబినేట్ గా మంత్రి ప్రమోషన్ ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బీసీ నినాదం ఎత్తుకున్న బీజేపీ.. ఇపుడు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన మురళీధర్ రావును రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేయడం వెనక పెద్ద వ్యూహమే దాగుందని చెబుతున్నారు. ఏది ఏమైనా మోడీ, అమిత్ షా, నడ్డా మనసులో ఏముందో ఎవరికి తెలియదు. ఇది కన్ఫామ్ అని కూడా చెప్పలేము. ఏది ఏమైనా తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.