Dearness Allowance: పెండింగ్‌ డీఏల్లో తెలంగాణ టాప్‌.. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని పెండింగ్‌ ఉన్నాయో తెలుసా?

Pending DAs In India: Telangana Top In Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన డియర్‌నెస్‌ అలవెన్స్‌ అనేది నాలుగు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా డీఏలు పెండింగ్‌ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అసలు పెండింగ్‌ లేని రాష్ట్రాలు ఏవి తెలుసుకుందాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 17, 2025, 03:16 PM IST
Dearness Allowance: పెండింగ్‌ డీఏల్లో తెలంగాణ టాప్‌.. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని పెండింగ్‌ ఉన్నాయో తెలుసా?

Pending DAs In India: ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే వారికి.. ప్రజల సమస్యలు పరిష్కరించే వారికి వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించి భవిష్యత్‌కు ఎన్నో ప్రణాళికలు వేసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల్లో కోతలు.. పెండింగ్‌లు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ప్రజలకు బాధ్యతగా సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులనే ప్రభుత్వాలు గుర్తించడం లేదు. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలు అందించడం లేదు. వాటిలో ముఖ్యమైన డియర్‌నెస్‌ అలవెన్స్‌. డీఏలు ఎప్పటికప్పుడు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో డీఏలు బకాయిపడ్డాయి. ఏయే రాష్ట్రం ఎన్ని పెండింగ్‌ డీఏలు ఉన్నాయో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. డీఏలపై ప్రభుత్వం కీలక ప్రకటన ఇదే!

డియర్‌నెస్‌ అలవెన్స్‌ అంశంలో చాలా రాష్ట్రాలు ఉద్యోగులకు బకాయి పడ్డాయి. వాటిలో అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం 5 డీఏలు పెండింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది. కొన్ని నెలల కిందట ఆరు డీఏలు పెండింగ్‌ ఉండగా.. ఇటీవల ఒకటి ఇచ్చిన విషయం తెలిసిందే. డీఏల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్యోగులు నిలదీస్తున్నారు. డీఏ బకాయిలు చెల్లించకపోతే త్వరలో సమ్మెకు దిగే ఆలోచనలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 

Also Read: Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. పెండింగ్‌ డీఏలపై అసెంబ్లీలో చర్చ

ఇక పెండింగ్‌ డీఏల్లో మేఘాలయ రెండో స్థానంలో నిలవగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు డీఏలు బకాయి పడింది. ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాల్సి ఉంది. మరికొన్ని రాష్ట్రాలు అసలు ఉద్యోగులకు డీఏ పెండింగ్‌ లేకుండా చూసుకుంటున్నాయి. తమిళనాడు, హర్యానా, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలు ఒక్కటంటే ఒక్క డీఏ ఆ రాష్ట్రాలు పెండింగ్‌ ఉంచలేదు. ఎప్పటికప్పుడూ ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తున్నాయి.

రాష్ట్రాల్లో పెండింగ్ డీఏలు ఇవే!
తమిళనాడు, హర్యానా, ఒడిశా, సిక్కిం ఈ నాలుగు రాష్ట్రాలు ఒక్క డీఏ కూడా పెండింగ్‌ లేదు.
తెలంగాణ -5
మేఘాలయ -3
ఆంధ్రప్రదేశ్‌ -2
ఉత్తరాఖండ్‌ -2
బిహార్‌  -2
కర్ణాటక -1
కేరళ -1
గుజరాత్‌ -1
మహారాష్ట్ర -1
మధ్యప్రదేశ్‌ -1
జమ్మూ కశ్మీర్‌ -1
రాజస్థాన్‌ -1
గోవా -1
అస్సాం -1
చత్తీస్‌గడ్‌ -1

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News