TG Weather Updates: తెలంగాణలో ఎండలు భగభగ మండనున్నాయి. వాతావరణంలో మార్పులతో కురిసిన అకాల వర్షాలతో రెండు మూడు రోజులు చల్లబడిన వాతావరణం ఇప్పడు మళ్లీ వేడెక్కుతోంది. రేపు అంటే మార్చ్ 26 నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో చెదురు ముదురు వర్షాలు ఇప్పుడు ఆగిపోయాయి. ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఎండలు ఓ వైపు, తీవ్రమైన ఉక్కపోత మరోవైపు ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి మద్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ తెలంగాణలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా మార్చ్ 26 నుంచి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
ఉత్తర దిశగా వీస్తున్న పొడి గాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని ఐఎండీ తెలిపింది. మార్చ్ 27-30 వరకూ తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రత 41-43 డిగ్రీల వరకూ నమోదవుతుందని హెచ్చరిక జారీ అయింది. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రత పెరగనుంది. 38-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి మాత్రం వడగాలులు తీవ్రత పెరగనుంది.
తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదిలాబాద్‌లో 39, నిజామాబాద్‌లో 38.2, భద్రాచలంలో 38.1, ఖమ్మంలో 38.3 డిగ్రీలు నమోదైంది. ఇక మహబూబ్ నగర్‌లో 36.5, నల్గొండలో 3, మెదక్‌లో 35.4, హనుమకొండలో 33.5, హైదరాబాద్‌లో 34.6 డిగ్రీలు నమోదైంది.
Also read: IT Returns: ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి, స్టెప్ బై స్టెప్ సులభమైన ప్రక్రియ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









