)
India Looted Telugu Exclusive Story: నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఒకప్పుడు మన దేశం ప్రపంచ సంపదకు కేంద్రంగా ఉండేదని మీకు తెలుసా? చరిత్రతో పాటు ఆర్థిక గణాంకాల ఆధారంగా బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశం ఎంతటి వైభవంతో విలసిల్లిందో మనందరికీ తెలుసు. అంతేకాకుండా భారతదేశంపై దండే ఎత్తిన కొంతమంది తెల్ల దొరలు ఆ సంపదను ఏ విధంగా దోచుకున్నారో? వారు దోచుకోకముందు భారతదేశం ఎంత సంపాదనను కలిగి ఉందో? ఇండిపెండెన్స్ అనంతరం భారతదేశం ఏ విధంగా కోలుకుందో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
క్రీస్తు శకం 1500 నాటి భారత జిడిపి ప్రపంచ జిడిపిలో 24 శాతం వాటాను కలిగి ఉండేదని ఆర్థిక నిపుణుల అంచనా.. సుమారు 700 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని సందర్శించిన ఇటలీ వ్యాపారి మార్క్ పోలో మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అభివర్ణించారు.. మౌర్యకాలంలో చాణక్యుని సహాయంతో దేశమంతటా ఒకే ఆర్థిక విధానాన్ని తీసుకువచ్చారు. నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. అంతేకాకుండా అర్థశాస్త్ర నిపుణులు చాణక్యుడి సహాయంతో ప్రత్యేకమైన ప్రణాళికలతో పన్నులు వసూలు చేయడం అమలు చేశారు..
క్రీస్తు శకం 300 నుంచి 800 ఏళ్ల మధ్యలో భారతదేశంలో స్వర్ణ యుగం ప్రారంభమైంది.. సముద్ర గుప్తుని కాలంలో కలలతో పాటు సాంస్కృతులు రచనలు వికసించాయి.. అందుకే ఈ కాలాన్ని గోల్డెన్ ఏజ్ గా పిలుస్తారు. అలాగే ఈ సమయంలో ఆర్యభట్ట కూడా భారతదేశంలో సున్నాలు కనుగొన్నారు. దీంతో ఈ కాలంలోనే విదేశీ వాణిజ్యం కూడా గుంజుకోవడం ప్రారంభమైంది. ఇక ఈ సమయంలోనే భారతదేశం బంగారు పిచ్చుక అనే పేరుతో ప్రపంచానికి పరిచయమైంది.. ఇక 1526 సమయంలో భారతదేశాన్ని మొగలుల కాలంగా పిలుస్తారు. ఈ సమయంలో అక్బర్ భారత్ ని పరిపాలించారు. ఇక ఈ సమయంలో ముస్లిమేతరులపై ఉన్న యాత్రికుల పన్ను (పిల్గ్రిమ్ టాక్స్)ను రద్దు చేయడం వంటి ప్రత్యేకమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టారు..
1526 సంవత్సరంలో భారతదేశం జిడిపి ప్రపంచం GDPలో 24 శాతం ఉండేదని సమాచారం. అలాగే ఇది పశ్చిమ యూరప్ GDP కంటే చాలా ఎక్కువ అని వివిధ పుస్తకాల్లో పేర్కొన్నారు. క్రీస్తు శకం 16 సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు మన దేశ సంపదపై కన్నేశారు.. వారు రాకముందు లాభాల్లో ఉన్న టెక్స్టైల్స్, జనపనారు, పత్తి పరిశ్రమలు వారు వచ్చాక కుప్పకూలిపోయాయి. అంతేకాకుండా ప్రపంచ మార్కెట్లో చౌకగా లభించే భారతీయ వస్త్రాలపై ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 70 నుంచి 80 శాతం వరకు అధిక పన్ను కూడా విధించారు. ఫలితంగా 1947 నాటికి జిడిపి ప్రపంచంలోనే భారతది రెండు శాతానికి తగ్గుతూ వచ్చింది.
భారత్ నుంచి బ్రిటిష్ వారు స్వాతంత్రానికి పూర్వం సంపదను కొన్ని ట్రిలియన్ దాకా దోచుకున్నారు. ఆర్థికవేత్తల పరిశోధనల ప్రకారం.. 1765 నుంచి 1938 వరకు బ్రిటిష్ వారు భారతదేశ నుంచి అక్షరాల 44.6 ట్రిలియన్ల డాలర్ల విలువైన సామగ్రిని తరలించినట్లు సమాచారం. ఈ విలువ నేటి ఇంగ్లాండు GDPలో 17 శాతంగా ఉంది. మైసూర్లో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)ను ఆధీనంలోకి తీసుకొని.. బంగారాన్ని 121 సంవత్సరాల పాటు తవ్వి దాదాపు 4 టన్నులకు పైగా బంగారాన్ని రిటర్న్ కు తరలించినట్లు సమాచారం. అంతేకాకుండా అత్యంత అరుదైన టిప్పు సుల్తాన్ ఉంగరం కూడా దొంగతనం చేసినట్లు బుక్కుల్లో రాశారు. ఇదిలా ఉంటే స్వాతంత్రం అనంతరం భారతదేశ ఆర్థిక పరిస్థితి అంతగా లేకపోయినప్పటికీ.. నెమ్మది నెమ్మదిగా ఇప్పటికీ పుంజుకుంటూ వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook