)
Tennis Player Killed By father Update: నిన్న ఢిల్లీలోని గురు గ్రామ్ లో జరిగిన టెన్నిస్ ప్లేయర్ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కన్నతండ్రి కూతురును హత్య చేసిన ఘటన దేశ రాజధాని లో సంచలనం సృష్టించింది. గత కొద్దిరోజులుగా రాధిక గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక అకాడమీని స్థాపించి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేది. అయితే కూతురు సంపాదనతో జీవిస్తున్నానని కొందరు గ్రామస్థులు తనను హేళన చేశారని ఆ అవమానాన్ని తట్టుకోలేక చంపేశానని తండ్రి దీపక్ ఒప్పుకున్నాడు. అకాడమీ మూసివేయాలని ఆమెకు పలుమార్లు చెప్పిన వినలేదన్నారు.
ఇక గురువారం గురు గ్రామ్‌లోని సెక్టార్ 57 ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా దేశ రాజధాని టెన్నీస్ క్రీడాకారిణీ హత్యతో షాక్‌కు గురైంది. ఈ రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణీని ఆమె కన్న తండ్రి కాల్చి చంపాడు. నిన్న ఉదయం 10:30 గంటల సమయంలో తన రివాల్వర్‌తో కాల్చి చంపారు. నిందితుడు దీపక్ పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. తమ గ్రామ ప్రజలు కూతురు సంపాదన పై బతుకుతున్నాడని ఎగతాళి చేసే వారిని ఆయన చెప్పారు. ఇక ఆ అవమానం భరించలేకే రివాల్వర్‌తో కాల్చి చంపానన్నాడు.
అయితే రాధికకు సోషల్ మీడియాలో రీల్స్ చేసే అలవాటు కూడా ఉంది. అయితే ఎన్నిసార్లు దీపక్ మానేయమని కోరినా ఆమె వినలేదు. తన పరువుకు భంగం కలిగిస్తున్నావని హెచ్చరించాడు. రాధికను టెన్నిస్ అకాడమీ కూడా మూసి వేయమని చెప్పి వినకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన దీపక్ కన్న కూతుర్నే చంపేశాడు. దీపక్ కి లైసెన్స్ రివాల్వర్ ఉంది. రాధిక వంట గదిలో పని చేస్తూ ఉన్న సమయంలో వెనుక నుంచి మూడు బుల్లెట్లతో రాధికను కాల్చి చంపాడు.
ఆ సమయంలో అతనితోపాటు భార్య మంజూ యాదవ్ ఇంట్లో ఉంది. శబ్దం విని రక్తపు మడుగులో రాధికను చూసిన సోదరుడు కులదీప్ యాదవ్ వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని అన్నారు. ఇక భార్య మంజు యాదవ్ వాంగ్మూలం ఇవ్వడానికి కూడా నిరాకరించింది. తనకు ఒంట్లో బాగాలేదని చెప్పింది. ఈ హత్య ఎలా జరిగిందో తెలీదు అని ఆమె చెప్పింది. మొదట్లో దీపక్ యాదవ్ బుకాయించాడు. రాధిక సూసైడ్ చేసుకుందని చెప్పాడు అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం ఒప్పుకున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook