close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఘుమ ఘుమ లాడే జైలు బిర్యానీ మీ కోసం...

జైలు బిర్యానీయా.. వింటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. పారడైజ్ బిర్యానీ తరహా  జైలు బిర్యానీయా అమ్ముతున్నారట.. అదికూడా ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తే చాలు.. నిమిషాల్లో మీ ఇంటి ముందుకు ఉంటుందట..విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...

Updated: Jul 11, 2019, 06:41 PM IST
ఘుమ ఘుమ లాడే  జైలు బిర్యానీ మీ కోసం...

జైలు ఖైదీలతో దుస్తూల తయారి, వస్తువుల తాయరి,  పెట్రోల్ బంకులు నిర్వహణ, వ్యవసాయం చేయించడం అందరికీ తెలిసిందే. జైళ్లలో సంస్కరణల్లో ప్రస్తుతం బేకరీ ఐటమ్స్, హోటల్ ఐటెమ్స్ కూడా తయారు చేయిస్తున్నారట..

వియ్యూర్ జైల్లో సరికొత్త ప్రయోగం 
కేరళలోని వియ్యూర్ జైలు ఈ సరికొత్త కొత్త ప్రయోగానికి నిలయంగా మారింది.  ఖైదీలతో దమ్ బిర్యానీ తయారుచేయించి విక్రయించాలని నిర్ణయించారు.  అంతేకాదు ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ సంస్థ స్విగ్గీతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. గురువారం నుంచే అమ్మకాలు కూడా మొదలయ్యాయి. ఇక్కడ సక్సెస్ అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా దీన్ని అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా వియ్యూర్ జైలు ఖైదీలు ప్రస్తుతానికి చికెన్ బిర్యానీ మాత్రమే తయారుచేస్తున్నారు. మున్ముందు బేకరీ ఐటమ్స్ తో పాటు తినుబండాలు వంటికి కూడా తయారు చేయించి అమ్మకాటికి పెడతారట..

ఘుమ ఘుమ లాడే జైలు బిర్యానీ ధర ఇదే...
ప్రముఖ మీడియా కథనం ప్రకారం వియ్యూర్ జైలులో తయారి చేస్తున్న చికెన్ బిర్యానీ  కాంబో ప్యాక్ లో లభ్యమవుతుంది. ప్లేటు ధర రూ.127గా నిర్ణయించారు. ఈ ప్యాక్ లో 300 గ్రాముల బిర్యానీ రైస్, ఓ చికెన్ లెగ్ పీస్, 3 చపాతీలు, సలాడ్, రైతా, ఓ కప్ కేక్, ఒక వాటర్ బాటిల్ అందిస్తారు. కాగా ఇక్కడి ఖైదీలు తయారుచేస్తున్న ఈ రుచికరమైన బిర్యానీని ఓ ప్రముఖ ఫుడ్ ఫ్యాక్టరీ తరఫున మార్కెటింగ్ చేస్తున్నట్లు తెలిసింది.