Chhattisgarh: షాకింగ్.. ఒకే ట్రాక్ మీద ఒకేసారి వచ్చిన మూడు రైళ్లు.. రెప్పపాటులో ఏంజరిగిందంటే..?

Bilaspur railway station: బిలాస్ పూర్  రైల్వేస్టేషన్ పరిధిలో మూడు రైళ్లు ఒకే ప్లాట్ ఫామ్ మీదకు వచ్చాయి. దీంతో రైళ్లలోని ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Written by - Inamdar Paresh | Last Updated : Nov 6, 2025, 04:47 PM IST
  • బిలాస్ పూర్ లో మరో ఘోరం..
  • మూడు రైళ్లు ఒకే ఫ్లాట్ ఫామ్ మీదకు..
Chhattisgarh: షాకింగ్.. ఒకే ట్రాక్ మీద ఒకేసారి వచ్చిన మూడు రైళ్లు.. రెప్పపాటులో ఏంజరిగిందంటే..?

Three Trains meets on The same track in Bilaspur railway station: ఇటీవల దేశంలో బస్సు ప్రమాదాలు, రైళ్ల ప్రమాదాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రజలు అసలు బస్సులు, ట్రైన్ ఎక్కాలంటేనే బిక్కు బిక్కు మంటున్నారు. రోడ్లు, రైల్వే స్టేషన్ లలో ప్రమాదాలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి బలంగా ఢీకొన్నాయి.  ఈ  ఘటనలో ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. రెండు రైళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

Add Zee News as a Preferred Source

మరోవైపు అనేక మంది గాయాలపాలయ్యారు.  ఈ ఘటన మరువక ముందే అదే చోట మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 
బిలాస్ పూర్ లోని రైల్వేస్టేషన్లో ఏకంగా మూడు రైళ్లు ఒకే ప్లాట్ ఫామ్ మీదకు వచ్చాయి.

ప్యాసింజర్, రెండు గూడ్స్ రైళ్లు ఒకే ప్లాట్ ఫామ్ మీదకు వచ్చాయి. ప్యాసింజర్ రైలు ప్లాట్ ఫామ్ మీద ఆగి ఉంది. దీంతో మరో రెండు రైళ్లు వెనక వస్తుండం చూసిన ప్రయాణికులు  ప్రాణ భయంతో పరుగులు పెట్టారు.

Read more: Horrific Accident: కార్తీక పౌర్ణమి రోజు ఘోరం.. గంగానది స్నానం చేసి వస్తుండగా రైలు ఢీకొని నలుగురి దుర్మరణం..

అప్పటికే లోకోపైలెట్ లు అప్రమత్తమై రెప్పపాటులో రైళ్లను ఆపేశారు. మరీ సిగ్నలింగ్ తప్పిదమో లేదా.. మరే టెక్నికల్ సమస్యనో తెలీదు కానీ.. మొత్తంగా మూడు రైళ్లు ఒకే ప్లాన్ ఫామ్ మీదకు వచ్చిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News