)
Tirumala Darshanam Time: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అధికమౌతోంది. ఇవాళ మంగళవారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. గత మూడు వారాల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరగవచ్చని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇవాళ కూడా భారీగా భక్తులు పోటెత్తారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం సిఫారసు లేఖల్ని తిరిగి పునరుద్ధరించినప్పటి నుంచి భక్తుల రద్దీ పెరుగుతోందని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. లక్షలాది భక్తులతో తిరుమల వీధులు కిటకిటలాడుతున్నాయి. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్మెంట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. ఉచిత దర్శనం కోసం క్యూ లైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతోందని టీటీడీ స్పష్టం చేసింది. టైమ్ స్లాట్ దర్శనం కోసం 4 గంటలు పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసినవారికి 3-4 గంటల సమయం పడుతోంది. సోమవారం అంటే నిన్న ఒక్కరోజే 85 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దాదాపు 35 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.89 కోట్లు వసూలైంది.
వేసవి సెలవులు మరి కొద్ది రోజుల్లో ముగుస్తున్నందున భక్తుల రద్దీ ఇంకా కొనసాగవనుంది. రానున్న వారం పది రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో రద్దీని తట్టుకునేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారని టీటీడీ తెలిపింది. నాణ్యమైన లడ్డూ ప్రసాదం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అందుకు అవసరమైన అధునాతన యంత్రాల్ని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. నెలకు కోటి లడ్డూలు విక్రయిస్తున్నారు.
నికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook