TTD Donations: శ్రీవారిపై కనకవర్షం, 10 రోజుల్లో 30 కోట్ల విరాళాలు

TTD Donations: తిరుమల తిరుపతి దేవస్థానంపై కనకవర్షం కురిసింది. భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. కేవలం 10 రోజుల వ్యవధిలో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 29, 2025, 10:57 AM IST
TTD Donations: శ్రీవారిపై కనకవర్షం, 10 రోజుల్లో 30 కోట్ల విరాళాలు

TTD Donations: వడ్డీ కాసుల శ్రీవారిపై కాసుల వర్షం కురిసింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు భారీగా విరాళాలు ఇవ్వడం సాధారణమే. కానీ ఈసారి రికార్డు స్థాయిలో విరాళాలు వచ్చి పడ్డాయి. రోజురోజుకూ ఆదాయం పెరుగుతోంది. కేవలం 10 రోజుల వ్యవధిలో ఏకంగా 30 కోట్ల విరాళాలు వచ్చాయి. 

Add Zee News as a Preferred Source

కాసులున్నవాడికే డబ్బులు వచ్చి పడతాయన్నట్టు అపర కుబేరుడిగా భావించే స్వామివారిపై విరాళాలు భారీగా వచ్చి పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో టీటీడీ దేవస్థానానికి భారీగా ఆదాయం వస్తోంది. టీటీడీలో జరిగే వివిధ కార్యక్రమాలకు భక్తులు పెద్దఎత్తున నిధులు అందిస్తుంటారు. ఇవి కాకుండా సాధారణ హుండీలో గుర్తు తెలియని వ్యక్తుల దానాలు లెక్కకు మించి ఉంటాయి. ఈ నెల 18న జరగనున్న ఎస్వీ అన్నదానం, ప్రాణదానం, విద్యాదానం కార్యక్రమాలకు బళ్లారికి చెందిన శ్రీ శ్రీనివాస కనస్ట్రక్షన్స్ సంస్థ 1.23 కోట్ల విరాళం అందించింది. 

ఇక ఈ నెల 21న జరగనున్న తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి దంపతులు 44 లక్షల విరాళం అందించారు. చంద్రబాబు మనువడు నారా దేవాన్ష్ పుట్టినరోజు పురస్కరించుకుని ఒకరోజు అన్నప్రసాదం కోసం ఈ విరాళం అందించారు. అదే రోజు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పధకానికి హైదరాబాద్‌కు చెందన ఏ వి రమణరాజు కోటి రూపాయలు అందించారు. ఇక మార్చ్ 24 తేదీన విజయవాడకు చెందిన శ్రీ రామ్ ప్రసాద్ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం అందించారు. కాకినాడకు చెందిన ఎలైట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అధినేత సూర్యనారాయణ రెడ్డి 6,66000 అందించారు. 

మార్చ్ 25వ తేదీన వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి 8.84 లక్షల విలువైన కెనాన్ కెమెరా బహుమతిగా అందించారు. మార్చ్ 26వ తేదీన రాజమండ్రికి చెందిన ఓ విద్య సంస్థ అధినేత కోటి రూపాయలు విరాళం అందించారు. మార్చ్ 27న చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్‌ఫ్రా సంస్థ కోటి రూపాయలు, శ్రీలంకకు చెందిన మరో దాత కోటి రూపాయలు, నోయిడాకు చెందిన ఓ సంస్థ 45 లక్షలు అందించారు. 

స్థూలంగా ఓసారి పరిశీలిస్తే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కు 11,67,15,870 రూపాయలు అందగా వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్‌ కు 8,14,90,958 రూపాయలు అందాయి.శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీం కోసం 4,88,50,391 రూపాయలు విరాళం వచ్చింది. ఇలా మార్చ్ 17 నుంచి మార్చ్ 27 మధ్యలో కేవలం 10 రోజుల్లో 29 కోట్ల 90 లక్షలు 71 వేల 336 రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి.

Also read: Saturn Transit 2025: ఈరోజే శని సంచారం.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News