Toll Tax Smart Card: కొత్తగా టోల్‌ట్యాక్స్ స్మార్ట్ కార్డ్ , ఎలా పనిచేస్తుంది లాభాలేంటి

Toll Tax Smart Card: టోల్‌ట్యాక్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించనుంది. త్వరలో మరో కొత్త విధానం ప్రవేశపెట్టనుంది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానం అమలు చేసే ఆలోచనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 4, 2025, 09:24 PM IST
Toll Tax Smart Card: కొత్తగా టోల్‌ట్యాక్స్ స్మార్ట్ కార్డ్ , ఎలా పనిచేస్తుంది లాభాలేంటి

Toll Tax Smart Card: జాతీయ రహదారులపై టోల్ గేట్లకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడనుంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో టోల్‌ట్యాక్స్ స్మార్ట్ కార్డ్ ప్రవేశపెట్టనుంది. ఈ స్మార్ట్ కార్డు దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్లలో పనిచేస్తుంది. టోల్‌ట్యాక్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఈ కార్డు ఎలా పనిచేస్తుంది, ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

జాతీయ రహదారిపై ఉండే టోల్ గేట్ రుసుము నుంచి మినహాయింపు పొందేలా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త విధానం తీసుకొస్తోంది. ఇది నెలలవారీ టోల్‌ట్యాక్స్ స్మార్ట్ కార్డ్. మంత్లీ టోల్‌ట్యాక్స్ స్మార్ట్ కార్డ్. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించేవారికి ముఖ్యంగా వాణిజ్య వాహనాలకు చాలా ప్రయోజనకరం. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పుడు అమల్లో ఉన్న ఫాస్టాగ్ స్థానంలో  కొత్తగా గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా టోల్ ట్యాక్స్ వసూలు చేసే ఆలోచనలో ఉంది. మరి అటువంటప్పుడు కొత్తగా స్మార్ట్ కార్డ్ సంగతేంటనే ప్రశ్న విన్పిస్తోంది. దేశవ్యాప్తంగా గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ప్రవేశపెట్టేందుకు మరింత సమయం పట్టనుంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే ప్రతి వాహనానికి చిన్న మెషీన్ ఇన్‌స్టాల్ చేస్తారు. జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేస్తుంది. ఈ కొత్త స్మార్ట్ కార్డ్ కూడా శాటిలైట్ టోల్ సిస్టమ్‌కు జత చేస్తారు. తద్వారా తరచూ ప్రయాణాలు చేసే వాహనాలు నెలకోసారి తీసుకునే పాస్‌లా పనిచేస్తుంది. 

మంత్లీ టోల్ స్మార్ట్ కార్డ్ తీసుకోనివాళ్లు ప్రస్తుతం ఉన్న విధానంలో టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందా, డిస్కౌంట్ ఏమైనా లభిస్తుందా అనేది క్లారిటీ లేదు. తరచూ జాతీయ రహదారులపై దూర ప్రయాణాలు చేసేవారికి స్మార్ట్ కార్డ్ విధానం లాభం చేకూరుస్తుంది. ఇది టోల్ విధానాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా టోల్ రుసుము ఖర్చుల్ని తగ్గిస్తుంది. 

Also read: Tax Deduction Tips: 12 లక్షలు కాదు, 14,65 లక్షల వరకూ నో ట్యాక్స్, ఎలాగంటే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News