)
Tomorrow Bank Holiday: గత ఆగస్టు నెల నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు వంటి వాటికి సెలవుల జాతర మొదలైంది. అవే పండుగ సెలవులు శ్రావణ మాసం నుంచి దసరా వరకు అనేక రకాలైన సెలవులు వచ్చాయి. అయితే తాజాగా సెప్టెంబరు 30న కొన్ని బ్యాంకులకు సెలవును మంజూరు చేశారు. దాని విశేషలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రి సందర్భంగా సెప్టెంబరు 30న దుర్గపూజ నిర్వహించనున్నారు. ఈ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. దుర్గా పూజ తర్వాత మహర్నవమి, దసరా, గాంధీ జయంతి వంటి పండుగల కారణంగా భారతదేశంలోని బ్యాంకులు సెప్టెంబర్, అక్టోబర్ ప్రారంభంలో వరుస సెలవులు రానున్నాయి.
ఈ విధంగా సెప్టెంబరు 30 దుర్గాష్టమి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా భారతదేశంలోని బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ ప్రకారం సెలవులను పాటిస్తాయి. ఈ సెలవుల్లో జాతీయ, ప్రాంతీయ వేడుకలు, అలాగే ప్రతి రెండవ, నాల్గవ శనివారం, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. వివిధ ప్రాంతీయ వేడుకల కారణంగా భారతదేశంలోని బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి.
దుర్గా పూజ.. నవరాత్రులలో ఏడవ రోజు అయిన మహా సప్తమి కోసం RBI సెప్టెంబర్ 29ని అగర్తల, కోల్‌కతా, గౌహతిలో బ్యాంకులకు ఇప్పటికే సెలవుగా ప్రకటించింది.
బ్యాంకు సెలవుల జాబితా: సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు..
సెప్టెంబర్ 30: దుర్గా పూజ, నవరాత్రి ఎనిమిదవ రోజును గుర్తుచేస్తూ అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్‌కతా, పాట్నా, రాంచీతో సహా అనేక నగరాల్లో మహా అష్టమి/దుర్గా అష్టమి కోసం బ్యాంకులు మూతపడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook