)
Tomorrow Schools Holiday: దేశంలో దసరా పండుగను ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో.. బంధుమిత్రులతో కలిసి చేసుకున్నారు. ఇక విద్యార్థులు, పిల్లలకైతే నిజంగంటే పండుగ. దాదాపు వారానికి పైగా సెలవులు పొందుతున్న విద్యార్థులకు మళ్లీ శుభవార్త వచ్చింది. రేపు కూడా అన్నీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. శుక్రవారం ఒక్క రోజు సెలవు ప్రకటిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటుండగా రేపు కూడా సెలవు ఇచ్చారు. అయితే సెలవు ఎక్కడ ఇచ్చారో తెలుసుకుందాం.
దసరా పండుగలో భాగంగా ఆయుధ పూజ కూడా ఘనంగా చేసుకుంటారు. అయితే పుదుచ్చేరిలో రేపు అంటే అక్టోబర్ 3వ తేదీన ఆయుధ పూజ చేసుకుంటున్నారు. విజయదశమి తర్వాత ఆయుధ పూజ ఉండడంతో పుదుచ్చేరిలో సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా పుదుచ్చేరిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బుధ, గురువారం సెలవు ఇవ్వగా రేపటి సెలవుతో కలిపితే మూడు రోజులు కలిసివచ్చాయి. శనివారం ఒక్క రోజు కూడా సెలవు ఇస్తే మొత్తం ఐదు రోజుల సెలవులు రానున్నాయి. విద్యార్థులకు మాత్రమే పుదుచ్చేరిలో రేపు సెలవు ఇవ్వగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేయనున్నాయి. ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు యథావిధిగా విధులకు వెళ్లాల్సి ఉంది.
సరస్వతి పూజ, ఆయుధ పూజ, విజయ దశమి పండుగల కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే తమిళనాడులో రేపు స్కూల్స్, కళాశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. పుదుచ్చేరిలో మాత్రం సెలవు ఇచ్చారు. పుదుచ్చేరి సెలవు కారణంగా తమిళనాడులో గందరగోళం ఏర్పడింది. ఆయుధ పూజ సందర్భంగా తమిళనాడులో కూడా సెలవు ప్రకటించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం సెలవు లేదని స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook