Tomorrow Schools Holiday: ముందు జాగ్రత్తగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు పిల్లల స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవుల విషయం తెలుసుకుని ఉండాలి. విద్యా సంవత్సరంలో సెలవుల జాబితాను ముందే ప్రకటించినా.. ఎప్పుడో విడుదల చేసి ఉంటారు కాబట్టి తెలియదు. ఏడాదంతా కాకుండా ఏ నెలకు ఆ నెల సెలవులు గుర్తుంచుకుంటే చాలు. ఈ క్రమంలోనే రేపు పాఠశాలలకు సెలవు ఉన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాం. రేపు అన్నీ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
Also Read: Jubilee Hills: బెట్టింగ్‌లోనూ జూబ్లీహిల్స్ వెర్రీ కాస్ట్‌లీ.. రూ.500 కోట్ల బెట్టింగ్?
రేపు తెలంగాణ, బిహార్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే తెలంగాణలోని అన్నీ జిల్లాల్లో కాదు ఒక్క హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సెలవు ఇచ్చారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ జరగడంతో ఓట్ల లెక్కింపు రేపు అంటే నవంబర్ 14వ తేదీన చేపడుతున్నారు. రేపు శుక్రవారం నియోజవర్గంలోని అన్నీ స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శనివారం ఒక్క రోజు సెలవు పెడితే ఆదివారంతో కలిపి మొత్తం మూడు సెలవులు కలిసి వస్తాయి. ఇలా అయితే విద్యార్థులకు పండుగే.
Also Read: Jubilee Hills: బెట్టింగ్‌లోనూ జూబ్లీహిల్స్ వెర్రీ కాస్ట్‌లీ.. రూ.500 కోట్ల బెట్టింగ్?
ఇక బిహార్ రాష్ట్రంలో అన్నీ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు సంబంధించిన ఓట్లు కూడా రేపు లెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లోని బుడ్గామ్, నగ్రోటా ప్రాంతాల్లో కూడా ఓట్ల లెక్కింపు ఉంది. ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ నిర్వహించగా అక్కడ రేపు ఓట్ల లెక్కింపు ఉండడంతో ఆ ప్రాంతాల్లో కూడా స్కూళ్లకు సెలవు ఇచ్చారు.
Also Read: Mowgli Teaser: యాంకర్ సుమ కొడుకు మోగ్లీ సినిమా టీజర్.. 'మగాడి జీవితంలో అదొక్కటే వరం!'
దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించలేదు. కానీ వాయు కాలుష్యం ఆధారంగా అక్కడ పాఠశాలలు నిర్వహించాలా? లేదా అనేది అక్కడి అధికారులు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. రేపు స్కూళ్ల సెలవు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యథావిధిగా పాఠశాలలు కొనసాగుతాయి. మొంథా తుఫాన్ ప్రభావంతో గతంలో భారీగా సెలవులు ఇవ్వడంతో ఏపీలో ఉన్న సెలవులు రద్దు చేసి పాఠశాలలు కొనసాగిస్తున్నారు. దీంతో ఏపీలో స్కూళ్లకు అదనపు సెలవులు ఉండకపోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









