Indus Waters Treaty: సింధు నది జలాల ఒప్పందం ఏమిటి? టాప్ 10 ముఖ్యాంశాలు ఇవే!

Indus Waters Treaty Key Points In Telugu: ఉగ్రదాడితో ఒక్కసారిగా పాకిస్థాన్‌, భారతదేశం మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈక్రమంలో భారతదేశం రద్దు చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందం గురించి తెలుసుకుందాం. ఆ ఒప్పందం రద్దుతో ఏం జరుగుతుందో? పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రభావం ఉందో చూద్దాం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 30, 2025, 04:07 PM IST
Indus Waters Treaty: సింధు నది జలాల ఒప్పందం ఏమిటి? టాప్ 10 ముఖ్యాంశాలు ఇవే!

Pahalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడితో మరోసారి అంతర్జాతీయంగా సింధు నది జలాల ఒప్పందం వెలుగులోకి వచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర ఘాతుకానికి ప్రతీకారంగా పొరుగు దేశం పాకిస్థాన్‌పై భారత్‌ బ్రహ్మాస్త్రంలాంటి సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నదీ జలాల ఒప్పందంతో పాకిస్థాన్‌కు జరిగే నష్టం ఏమిటి? అసలు సింధు నదీ జలాలు అంటే ఏమిటి? దానికి అంతటి ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Summer Best Tour Places: సమ్మర్‌ సెలవుల్లో బెస్ట్‌ టూర్‌ ప్లేస్‌లు ఇవే.. జీవితంలో మరచిపోరు

సింధు నది జలాల ఒప్పందం అనేది భారతదేశం, పాకిస్తాన్ మధ్య 1960లో కుదిరిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. సింధూ నది జలాలను పంచుకునే అంశంపై ఈ ఒప్పందం ఇరు దేశాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో సింధు నదీ వ్యవస్థలోని నీటిని పాకిస్థాన్‌, భారతదేశం ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించారు. రెండు దేశాల మధ్య ప్రవహించే సింధు నదిపై వివాదాలు లేకుండా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం కారణంగా ఇరు దేశాల మధ్య నీటి వివాదం సద్దుమణిగింది.

Also Read: Group 1 Posts: తెలంగాణ గ్రూప్-1 పోస్టుల భర్తీపై బిగ్‌ ట్విస్ట్‌.. రంగంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్

సింధు నది జలాల ఒప్పందంలో ముఖ్యాంశాలు
సంతకం తేదీ: 19 సెప్టెంబర్ 1960
సంతకం చేసినది:

భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్

మధ్యవర్తి: వరల్డ్ బ్యాంక్

నదుల విభజన
పశ్చిమ నదులు (ఇండస్, జెహలమ్, చీనాబ్) పూర్తిగా పాకిస్తాన్‌కు కేటాయించారు.
తూర్పు నదులు (రావి, బియాస్, సట్లేజ్) పూర్తిగా భారతదేశానికి కేటాయించారు.

ముఖ్యమైన విషయాలు
భారత్‌కు పశ్చిమ నదులపై ఆర్థిక, నీటి విద్యుత్ ఉత్పత్తి కోసం పరిమిత హక్కులు ఉన్నాయి. కానీ పెద్ద మళ్లింపులు చేయడం వీలు కాదు.
స్థిర సింధు జలాల సంఘం (Permanent Indus Commission) ఏర్పాటు చేయగా.. ఇది జల వివాదాలు పరిష్కరించడానికి ఏర్పాటుచేసినది.

పహల్గమ్‌తో ఒప్పందం రద్దు
పలు సందర్భాల్లో పాకిస్తాన్ అభ్యంతరాలు తెలిపినప్పటికీ ఈ ఒప్పందాన్ని భారతదేశం పాటిస్తోంది. 2023లో ఈ ఒప్పందాన్ని సవరిస్తే బాగుంటుందని భారతదేశం పాకిస్తాన్‌కు నోటీసు ఇచ్చింది. పహల్గమ్‌ ఉగ్రదాడితో భారత ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసుకుంది. ప్రస్తుతం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు పాకిస్థాన్‌లో నీటికి గండం ఏర్పడింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News