School Holidays: విద్యార్థులకు త్రిబుల్‌ ధమాకా.. వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవు

Triple Jackpot To Students Three Days School Holiday: విద్యార్థులకు మరో శుభవార్త. మళ్లీ వరుసగా స్కూళ్ల సెలవులు వచ్చేశాయి. ఏకంగా మూడు రోజులు సెలవు ఉండడంతో పండుగ చేసుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడ సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 6, 2025, 11:26 PM IST
School Holidays: విద్యార్థులకు త్రిబుల్‌ ధమాకా.. వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవు

Tomorrow School Holiday: క్యాలెండర్‌లో నవంబర్‌ నెల వచ్చిన తొలి పది రోజుల్లోనే భారీగా సెలవులు వచ్చేశాయి. ఇప్పటికే కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతితో సెలవులు రాగా.. ఇప్పుడు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఒక ఆదివారంతో కలిపి వరుసగా మూడు రోజుల సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులు పాఠశాలలకు మాత్రమే ఉన్న విషయం గమనించాలి. దేశవ్యాప్తంగా కాకుండా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే స్కూళ్లకు సెలవులు వచ్చాయి. ఏపీ, తెలంగాణలో మాత్రం మూడు రోజులు కాకుండా రెండు సెలవులు వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే శనివారం సెలవు కూడా లేదు. కేవలం ఆదివారం సెలవుతో సరిపెట్టుకోవాల్సి ఉంది.

Add Zee News as a Preferred Source

Also Read: DMart Shopping: డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే మీ పర్స్‌ ఖాళీ కాదు

మేఘాలయలో వంగల పండుగ సందర్భంగా అక్కడ ప్రభుత్వ సెలవు ఇచ్చారు. ఇక ఛాత్‌ పూజ ఇంకా పలు రాష్ట్రాల్లో చేసుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో రేపు అంటే నవంబర్‌ 7వ తేదీన శుక్రవారం పలు రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు. బీహార్, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఛఠ్ పూజను ఘనంగా చేసుకుంటారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. శుక్రవారం సెలవుతో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రెండో శనివారం, ఆదివారం కలిపితే మొత్తం మూడు రోజులు అవుతున్నాయి.

Also Read: Schools Holiday: రేపు స్కూళ్లతోపాటు ఉద్యోగులకు సెలవు.. ఎందుకు? ఎక్కడో తెలుసా?

అయితే ఉత్తరప్రదేశ్‌లో వరుసగా నాలుగు రోజుల సెలవులు ప్రకటించగా నిన్నటితో ముగిసిపోయాయి. బులంద్‌షహర్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నవంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు వరుసగా 4 రోజుల సెలవులు ప్రకటించారు. గంగా స్నాన్ మేళా, గురు పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా అక్కడ భారీగా సెలవులు ఇచ్చారు. నాలుగు రోజుల సెలవులు ముగియడంతో రేపు యథావిధిగా పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని బులంద్‌షహర్‌ జిల్లా విద్యాధికారులు తెలిపారు.

Also Read: KTR Challenge: మగ పుట్టుక పుడితే రేవంత్ రెడ్డి రా చూస్కుందాం: కేటీఆర్ సవాల్

ఏపీ విద్యార్థులకు షాక్‌..
తెలంగాణలో రెండో శనివారంతో కలిపితే విద్యార్థులకు రెండు రోజుల సెలవులు వస్తున్నాయి. అయితే రెండో శనివారం సెలవు అనేది కొన్ని పాఠశాలల్లో మాత్రమే ఇస్తున్న విషయం గమనించాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విద్యార్థులకు షాక్‌ ఇచ్చే వార్త ఇది. వీరికి రెండో శనివారం రోజు కూడా స్కూళ్లు తెరచి ఉండనున్నాయి. మొంథా తుఫాను ప్రభావానికి గురైన జిల్లాల్లో పాఠశాలలకు వరుసగా సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగా నష్టపోయిన పని దినాలను రెండో శనివారం సెలవు దినాలలో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శుక్ర, శనివారాల్లో పాఠశాలలకు వెళ్లి ఆదివారం సెలవును మాత్రమే ఏపీ విద్యార్థులు తీసుకోవాల్సి ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News