Garimella Balakrishna Prasad Passes Away:
ప్రముఖ గాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం తిరుపతిలోని తన స్వగృహంలో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
1978 నుంచి 2006 వరకు తితిదే ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య సంకీర్తనలకు ప్రాణం పోసిన గాయకుడిగా పేరు పొందారు. ఆయన వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు వంటి ప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చారు.
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, సంప్రదాయ సంగీతానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు.
సంప్రదాయ సంగీతంతో పాటు, కర్నాటక, లలిత, జానపద సంగీతాలలో కూడా గరిమెళ్ల తనదైన ముద్ర వేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, సంగీత ప్రపంచం చిరస్మరణీయంగా ఉంచుకుంటుందని పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
ఇక ఈ సంఘటన ఎంతోమందిని శోకసముద్రంలో నింపింది. ఎన్నో పాటలను అద్భుతంగా ఈయన పాడారు. ముఖ్యంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కీర్తనలు అంటే ఈయన పేరు ప్రధానంగా వినిపించేది. అలాంటి సంగీత ప్రావీణ్యుడు తుది శ్వాస విడవదంతో ఆయనకు అందరూ కూడా సోషల్ మీడియాలో సైతం నివాళులు అర్పిస్తున్నారు.
Also read: Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు, ఊహించని విధంగా విజయశాంతి పేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్- https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









