)
TVK Vijay: కరూర్ తొక్కిసలాటలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని విజయ్ స్వయంగా కలుస్తానని హామీ ఇచ్చాడని.. కానీ రాలేదని అందుకే ఆ డబ్బును తిరిగి పంపించామని బాధితులు తెలిపారు. కోడంగిపట్టి కుటుంబానికి చెందిన రమేశ్.. విజయ్ నిర్వహించిన కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. వీడియో కాల్ సందర్భంగా స్వయంగా కలుస్తానని చెప్పిన విజయ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా రూ. 20 లక్షల రూపాయలను పంపించాడు. అతను హామీ ఇచ్చినట్లు రాకపోవడంతో తాము నిరాశ చెందామన్నారు.
విజయ్ వ్యక్తిగత ఓదార్పును తాము ఆశించామన్నారు. అతని డబ్బును కాదన్నారు. తన భర్త జీవిత విలువను డబ్బుతో కొలవలేమన్నారు. అతని జీవితం తనకు ఈ డబ్బు కంటే ఎక్కువ అని ఆమె చెప్పింది. దీంతో ఖంగు తినడం విజయ్ వంతు అయింది. ఇక తమిళనాడులో కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. విజయ్ నిర్వహిస్తున్న మీటింగ్ లో ఒక్కసారి ఎక్కువ మంది అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. దీంతో 41 మంది దుర్మరణం పాలయ్యారు. మరోవైపు ఘటన జరిగిన తర్వాత బాధితులను ఎలా ఉన్నారనేది పట్టించుకోకుండా హీరో విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శల పాలైయ్యారు.
ఆ తర్వాత వారి పరిస్థితి ఎలా ఉందో పట్టించుకోలేదు. పట్టించుకోవాల్సిన పరిస్థితుల్లో పట్టించుకోకుండా.. ఆ తర్వాత తీరిగ్గా వారు ఎలా ఉన్నారనే అంశంపై మాట్లాడంపై కరూర్ బాధితులు విజయ్ తీరుపై మండిపడుతున్నారు. తాజాగా బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా పరామర్శిస్తాన్న సదరు హీరో.. కేవలం నష్ట పరిహారాన్ని ఆయా కుటుంబాలకు పంపించారు. కొన్ని ఫ్యామిలీలు ఆ సాయాన్ని తీసుకున్నా.. ఓ బాధితురాలు.. తమను విజయ్ వ్యక్తిగతంగా పరామర్శించక పోవడాన్ని తప్ప పడుతూ.. ఆయన ఇచ్చిన రూ. 20 లక్షల చెక్కును తిరిగి ఇచ్చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.