
UN On Pahalgam Attack: పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ ఐక్యరాజ్య సమితి కీలక విజ్ఞప్తి చేసింది. ఇరు దేశాలు సాధ్యమైనంత వరకు సంయమనం పాటించాలి అని సూచించింది. ఈ మేరకు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. జమ్మ కశ్మీర్లో ఉగ్రదాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రెండు దేశాలు కలిసి చర్చలు జరిపి సమస్యని పరిష్కరిచుకోవాలని కోరారు.
ఇప్పటికే సరిహద్దుల్లో హైటెన్షన నెలకొంది. నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఉగ్రదాడి ఘటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, పాక్ యుద్ధ వాతావరణం వల్ల పారా మిలిటరీ బలగలకు సెలవులు రద్దు చేసి వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఎల్ఓసీ వద్ద ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక అసలు క్రియాశీల శిబిరం ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉగ్ర మాడ్యూల్‌కు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, డిప్యూటీ సైఫుల్లా సూత్రదారులుగా ఉన్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాదులు శిబిరం నుంచి విదేశీ ఉగ్రవాదులు ఉగ్రదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరికి స్థానిక మిలిటెంట్లు కూడా సహాయంగా నిలిచారి తెలుస్తోంది.
లష్కరే తోయిబా కమాండర్ హతం..
పహల్గాం ఘటనతో ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల ఏరివేత చేపట్టారు. బందిపోరాలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు, భారత సైనికులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కొంతమంది గాయపడ్డారు.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం బైసరన్ లోయాలో ఉగ్రవాదులు టూరిస్టులపై తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో 26 మంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు. దీనికి లష్కరే తోయిబా సంస్థ కింద పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe