UPS Pension Calculation: యూపీఎస్ విధానంలో ఎవరికి ఎంత పెన్షన్ లభిస్తుంది, ఈజీ లెక్క మీ కోసం

UPS Pension Calculation: ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన అప్‌డేట్. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మరి కొద్ది రోజుల్లో అమల్లోకి రానుంది. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించినా యూపీఎస్ విధానం అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2025, 10:38 PM IST
UPS Pension Calculation: యూపీఎస్ విధానంలో ఎవరికి ఎంత పెన్షన్ లభిస్తుంది, ఈజీ లెక్క మీ కోసం

UPS Pension Calculation: నిర్దిష్ట పెన్షన్ ఇచ్చే విధంగా రూపకల్పన చేసిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనుంది. ఈ పధకం ద్వారా ప్రతి నెలా ఎంత పెన్షన్ లభిస్తుందనేది చాలా సులభంగా తెలుసుకోవచ్చు. యూపీఎస్ లేకుంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కొనసాగించవచ్చు. 

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు అమల్లో ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌తో రిటైర్మెంట్ తరువాత ఉద్యోగులకు నిర్దిష్టమైన పెన్షన్ హామీ లభిస్తుంది. అంటే ఉద్యోగుల పెన్షన్ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు లేదా రుణాలపై ఆధారపడి ఉండదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది మార్కెట్‌తో లింక్ అయి ఉంటుంది. కానీ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లో నెలకు 10 వేల రూపాయలు పెన్షన్ నిర్దిష్టంగా అందుతుంది. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఎన్‌పీఎస్ విధానం నుంచి యూపీఎస్ విధానం ఎంచుకున్న ఉద్యోగి తిరిగి ఎన్‌పీఎస్ విధానం ఎంచుకోలేడు. ఈ విధానంలో 12 నెలల కనీస వేతనంలో 50 శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తారు. 

సంబంధిత ప్రభుత్వ ఉద్యోగి 25 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు కలిగి ఉంటే ఈ ఫార్ములా పనిచేస్తుంది. ఉద్యోగికి 25 ఏళ్ల కంటే తక్కువ సర్వీసు మిగిలి ఉంటే మాత్రం పే అవుట్ దానిని బట్టి ఉంటుంది. 25 ఏళ్ల సర్వీసు తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే రిటైర్మెంట్ వాస్తవ తేదీ నుంచి పెన్షన్ ప్రారంభం అవుతుంది. ఇంకా సులభంగా అర్థమయ్యేందుకు మూడు ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉద్యోగి సర్వీసు 25 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్లు ఉంటే  ఆ ఉద్యోగి రిటైర్ అయ్యేనాటికి సరాసరి కనీస వేతనం 12 లక్షలు ఉంటే ఈ ఫార్ములా ప్రకారం 12తో భాగించాలి. అంటే 1 లక్ష రూపాయలు అవుతుంది. ఇందులో సగం అంటే 50 వేలు పెన్షన్ రూపంలో వస్తుంది. 

ఇక మరో లెక్క ప్రకారం ఓ ఉద్యోగి సర్వీసు 25 ఏళ్ల కంటే తక్కువ ఉండి 20 ఏళ్లు పనిచేసి రిటైర్ అయితే ఆ ఉద్యోగికి 20/25=0.8 ఫార్ములా పనిచేస్తుంది. అంటే 40 వేలు పెన్షన్ లభిస్తుంది. ఇక మూడో లెక్క ప్రకారం ఉద్యోగి కనీస వేతనం రిటైర్మెంట్ నాటికి 15 వేలు ఉంటే 7500 పెన్షన్ లభించాలి. కానీ ఇది నిర్దేశిత పెన్షన్ కంటే తక్కువ అయినందున నెలకు 10 వేలు పెన్షన్ చెల్లిస్తారు. 

Also read: KKR New Captain: కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా అజింక్యా రహానే, ఎవరి కెప్టెన్సీ బాగుందో చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News