Union Budget 2026: నేడే కేంద్ర బడ్జెట్.. పెరిగేవి తగ్గేవి ఇవే..

Union Budget 2026: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ  బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రికార్డు స్థాయిలో నిర్మలమ్మ 9వ సారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.  ఎప్పటిలానే ఈసారి కూడా ఎలాంటి ప్రకటనలు ఉంటాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 1, 2026, 08:26 AM IST
Union Budget 2026: నేడే కేంద్ర బడ్జెట్.. పెరిగేవి తగ్గేవి ఇవే..

Union Budget 2026 highlights: ప్రతి యేడాది ఫిబ్రవరి 1న  బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఫిబ్రవరి 28 లేదా 29వ తేదిల్లో ప్రవేశపెట్టే బడ్జెట్.. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంప్రదాయానికి బ్రేకులు వేసింది. అంతేకాదు రైల్వే బడ్జెట్ ను సెపరేట్ గా ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని తీసేంది. అంతా యూనియన్ బడ్జెట్ లోనే కేటాయింపులు చేసేలా చేశారు. ఈ రకంగా రైల్వే శాఖపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసారు. ఇక బడ్జెట్ తో నిమిత్తం లేకుండా ప్రతి నెల జీఎస్టీ సమావేశంలోనే వస్తువుల ధరలను నిర్ణయించే పద్ధతి తీసుకొచ్చారు. 

Add Zee News as a Preferred Source

ఇపుడు బడ్జెట్ కేవలం అనేది కొన్ని కీలక నిర్ణయాలు వేతన జీవుల కట్టే టాక్స్ వంటి వాటిపై మాత్రమే ఇందులో ప్రస్తావిస్తున్నారు. గతేడాది బడ్జెట్ లో ఏకండా రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం పెద్ద ఊరట. కానీ గత బడ్జెట్ లో రిటర్న్స్ సమర్పించే వాటిలో పాత పద్ధతితో పాటు కొత్తది ఉండేలా చూసారు. తాజాగా ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ లో పాత వాటన్నింటికి చరమ గీతం పాడబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కొత్త పద్ధతినే అందరు ఫాలో అయ్యేలా చేస్తారనే టాక్ నడుస్తోంది. 

మరోవైపు మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు, రైతులు, మహిళలు, కార్పొరేట్లు, ఇన్వెస్టర్లు, సీనియర్ సిటిజెన్లు ఇలా అంతా ఎవరికి ఏమేం ప్రకటనలు ఉంటాయోనని ఉత్కంఠగా ఉన్నారు.  మరి ఈసారి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందా ? .. సంస్కరణలకు పెద్ద పీట వేస్తుందా? .. సామాన్యులు, మహిళలపై వరాల జల్లు కురిపిస్తుందా ? అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఫిబ్రవరి 1న ఆదివారం అయినా.. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈమె పార్లమెంట్ లో వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతూ సంచలన రికార్డు క్రియేట్ చేస్తున్నారు.  

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

మరోవైపు  సమావేశాల్లో ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే JPC నివేదిక సిద్ధమైందట.  మరోవైపు  అమరావతిని AP రాజధానిగా చట్టబద్ధత కల్పించే   బిల్లును కూడా సభ ముందుకు తీసురాబోతున్నారు. పూర్వోదయ  పథకం కింద రాష్ట్రానికి భారీ నిధులు కేటాయించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఆదాయ పన్ను సరళీకరణ, వక్ఫ్ బోర్డు సవరణలు, వికసిత్‌ భారత్‌ శిక్షా అధీక్షణ్‌ బిల్లు కూడా ఈ సమావేశాల్లో చర్చకు రాబోతున్నాయి. 

Read more:​ Chiranjeevi Sankranthi Hits:‘మన శంకర వరప్రసాద్ గారు’ సహా సంక్రాంతి బరిలో హిట్టైన చిరంజీవి మూవీస్ ఇవే..

Read more:​ Top 10 Richest Actors: మన దేశంలో అత్యంత ధనవంతులైన హీరోలు వీళ్లే.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News