Bhupathi raju Srinivasa varma injured in road accident: దేశ రాజధాని ఢిల్లీలో అనుకొని ఘటన చోటు చేసుకుంది. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంకు గురైంది. ఆయన తన కారులో.. పార్లమెంట్ భవనం దగ్గరలోని విజయ్ చౌక్ నుంచి ఎయిర్‍పోర్టుకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఒక కారును తప్పించబోయి.. డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేశారు.
ఇంతలో కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందరున్న కారునుబలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి తలకు, కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. కారు కూడా చాలా డ్యామెజ్ అయ్యింది. వెంటనే కేంద్ర మంత్రిని ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో చికిత్స తీసుకున్న తర్వాత కేంద్ర మంత్రి.. గాయాల కట్టుతోనే.. విజయవాడకు బయలుదేరారు. కాసేపటి క్రితం అంటే.. 5.30 గంటల ప్రాంతంలోఈ ప్రమాదం జరిగింది. మరోవైపు శ్రీనివాసవర్మకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న కూటమి నేతలు తీవ్ర ఆందోలన వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులు ఘటనకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









