Union minister Daughter: కేంద్ర మంత్రి కూతురికి వేధింపులు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

Raksha khadse daughter harassed: కేంద్రమంత్రి బీజేపీ నేత రక్షా ఖడ్సే ఇటీవల తన కూతురిపై కొందరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 3, 2025, 03:09 PM IST
  • కేంద్ర మంత్రికూతురికి వేధింపులు..
  • విచారణ చేపట్టిన పోలీసులు..
Union minister Daughter: కేంద్ర మంత్రి కూతురికి వేధింపులు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

Union minister daughter harassed case: కేంద్ర మంత్రి  రక్షా ఖడ్సే తన కూతురుని ఇటీవల కొందరు వేధింపులకు పాల్పడ్డారని చెప్పడం ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఒక కేంద్ర మంత్రి, మరోవైపు సొంత పార్టీ అధికారంలో ఉన్న వాళ్లకే ఈ పరిస్థితి ఉంటే.. మిగత సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఈ ఘటనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే..  మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో తన కుమార్తెను, ఆమె స్నేహితులను కొందరు వ్యక్తులు వేధించారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రక్షా ఖడ్సే ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. దీనిపై పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది.

ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందిస్తూ నిందితులు ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వారని మండిపడ్డారు. కావాలనే కేంద్ర మంత్రి కూతుర్ని టార్గెట్ గా చేసుకుని వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.  నిందితుల్లో ఒకడైన పీయూష్‌ మోరే.. శివసేన షిండే వర్గానికి చెందినవాడుగా సమాచారం. అయితే.. ఈ విధంగా వేధింపులు చేయడం ద్వారా.. పార్టీని ప్రజల్లో నెగెటివ్ అభిప్రాయం వచ్చేందుకు ఈ విధంగా చేసినట్లు తెలుస్తొంది.

Read more: Himani Narwal Murder: హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు అరెస్ట్.. ఎవరంటే..?

ఈ క్రమంలో నిందితుల్లో ఏడుగురిని అరెస్ట్ చేసి తమదైన స్టైల్ లో విచారిస్తున్నారు. వీరంతా వేధింపులకు పాల్పడటానికి వెనుక ఎవరైన ఉన్నారా.. అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కారణంగా కేంద్ర మంత్రి ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లేక్కడం కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News