UPI Payments: దేశమంతా నిలిచిపోయిన యూపీఐ సేవలు, చెల్లింపుల్లో అంతరాయం

UPI Payments: దేశం మొత్తం ఒక్కసారిగా స్థింబించుకుపోయింది. ఎవరూ ఊహించని విధంగా యూపీఐ లావాదేవీలు ఆగిపోవడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా లక్షల మందికి అంతరాయం ఏర్పడంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2025, 03:15 PM IST
UPI Payments: దేశమంతా నిలిచిపోయిన యూపీఐ సేవలు, చెల్లింపుల్లో అంతరాయం

UPI Payments: ఇటీవలి కాలంలో ఎక్కడికి వెళ్లినా ఆన్ లైన్ చెల్లింపులు అంతకంటే ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు పెరిగిపోయాయి. అయితే ఇవాళ మద్యాహ్నం దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెల్లింపులు చేయలేక తిరిగొచ్చిన సందర్భాలు చాలా కన్పించాయి. 

Add Zee News as a Preferred Source

దేశంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. ఇవాళ ఏప్రిల్ 12 మద్యాహ్నం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ లో భారీ అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది ప్రజలు చెల్లింపులు జరపలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేటీఎం, ఫోన్ పే, గుగుల్ పే వంటి యాప్స్ ఏవీ పనిచేయలేదు. చెల్లింపులు చేద్దామంటే నెట్ వర్క్ ఇష్యూ కన్పించేది. యూపీఐ సేవలు ఆగిపోవడంతో సోషల్ మీడియా అంతా ఇవే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎక్కడా ఏ కొనుగోలు కూడా జరగలేదు. చాలామంది చెల్లింపులు చేయలకే కొనుగోళ్లు వాయిదా వేసుకున్నారు. యూపీఐపై విపరీతంగా ఆధారపడటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది బ్యాంకుకు సంబంధించిన సమస్య కాదు. అన్ని బ్యాంకుల వారికి అన్ని యాప్స్ కు ఇదే సమస్య. యూపీఐ వ్యవస్థలోనే పెద్ద అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. 

యూపీఐ అనేది ఆర్బీఐ పర్యవేక్షణలో పనిచేసే యాప్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. మొబైల్ యాప్స్ ద్వారా వివిధ బ్యాంకు ఎక్కౌంట్ల మధ్య లావాదేవీల్ని జరుపుతుంది. చిన్న చిన్న చెల్లింపుల నుంచి భారీ లావాదేవీలు అన్నీ సజువుగా క్షణాల్లో జరుగుతాయి. దాంతో అందరూ యూపీఐపై తీవ్రంగా ఆధారపడిపోయారు. ఇప్పుడు ఈ వ్యవస్థ పనిచేయకపోవడంతో ప్రజానీకం తీవ్రం ఇప్పందులు పడింది. 

Also read: Tamilnadu BJP: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్.. తెలంగాణ అధ్యక్షుడు అతడేనా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Trending News