UPSC Civils Result: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ఉద్యోగాలకు సంబంధించి సివిల్స్ తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఫలితాల అనంతరం ఇంటర్వ్యూలు పూర్తవడంతో సివిల్స్‌కు సంబంధించిన తుది ఫలితాలు వెల్లడయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి సంబంధించి ఫలితాలు వెల్లడి కాగా.. ర్యాంకుల జాబితాను కూడా విడుదల చేసింది.
Also Read: Pope Francis: ఉంగరం, జీతం, అంత్యక్రియలు.. పోప్ ఫ్రాన్సిస్ టాప్ 10 రహాస్యాలు ఇవే..
సివిల్స్ తుది ఫలితాల్లో శక్తి దుబే దేశంలోనే తొలి ర్యాంకర్‌గా నిలిచాడు. హర్షిత గోయల్ రెండో ర్యాంకర్‌గా అర్చిత్ పరాగ్ మూడో ర్యాంకు, షా మార్గి చిరాగ్ నాలుగో ర్యాంకు, ఆకాశ్ గార్గ్ ఐదు, కోమల్ పునియా ఆరో, ఆయుషీ బన్సల్ ఏడో ర్యాంకు, రాజ్‌కృష్ణ ఝా ఎనిమిదో ర్యాంకు, ఆదిత్య విక్రమ్ అగర్వాల్ తొమ్మిదో ర్యాంకు, మయాంక్ త్రిపాఠి పదో ర్యాంకు సాధించారు. దీంతో ఆయా కుటుంబసభ్యులు ఆనందాల్లో మునిగారు.
సివిల్స్‌లో తెలుగు ర్యాంకర్లు వీరే..
సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు సత్తా చాటారు. ఎట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు సాధించగా.. బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకు, శ్రవణ్‌కుమార్ రెడ్డి 62వ ర్యాంకు, సాయి చైతన్య జాదవ్ 68వ ర్యాంకు, ఎన్ చేతనరెడ్డి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేశ్ రెడ్డి 119వ ర్యాంకు, చల్లా పవన్ కల్యాణ్ 146వ ర్యాంకు, ఎన్.శ్రీకాంత్ రెడ్డి 151వ ర్యాంకు, నెల్లూరు సాయితేజ 154వ ర్యాంకు, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులు సాధించారు.
Also Read: K Kavitha: 'తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు' గులాబీ శ్రేణులకు కవిత పిలుపు
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1,056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 16వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష జరగ్గా.. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. జనవరి 7 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు దశల వారీగా వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించింది. తుది ఫలితాల్లో 1,009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో జనరల్ కేటగిరీ 335 మంది, ఈడబ్ల్యూఎస్ 109, ఓబీసీ 318, ఎస్సీ 160, ఎస్టీ కేటగిరీ నుంచి 87 మంది ఎంపికయ్యారు.
తుది ఫలితాలకు సంబంధించి సమాచారం కోసం యూపీఎస్సీ క్యాంపస్‌లోని పరీక్షా హాల్ వద్ద కౌంటర్‌లో సంప్రదించాలని యూపీఎస్సీ సూచించింది. పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య స్వయంగా లేదా 23385271, 23381125, 23098543 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. సివిల్స్ అభ్యర్థుల మార్కుల జాబితాను 15 రోజుల్లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









