UPSC CSE 2025: యూపీఎస్‌సీ 2025 ఫలితాలు విడుదల...ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచిన శక్తి దూబే...తెలుగు రాష్ట్రాల్లో టాపర్స్ ఎవరంటే..?

UPSC CSE 2025: UPSC 2024 తుది ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 1009 మంది అభ్యర్థులు ఎంపికవగా టాప్ యాంకర్ గా శక్తి దుబే నిలిచారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన సాయి శివాని 11వ ర్యాంకు సాధించి ముందు వరుసలో నిలిచింది. ఆమెతో పాటు మరికొంతమంది తెలుగు విద్యార్థులు సైతం యూపీఎస్సీ తుది ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించారు.  

Written by - Bhoomi | Last Updated : Apr 22, 2025, 04:33 PM IST
UPSC CSE 2025: యూపీఎస్‌సీ 2025 ఫలితాలు విడుదల...ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచిన శక్తి దూబే...తెలుగు రాష్ట్రాల్లో టాపర్స్ ఎవరంటే..?

UPSC CSE 2025: UPSC 2024 తుది ఫలితాలు నేడు విడుదలయ్యాయి. మొత్తం 1009 మంది  అభ్యర్థులు  IAS, IFS, IPS, Central Services (Group A & B) పోస్టులకు ఎంపికయ్యారు. వీరిలో టాప్ 3 ర్యాంకర్లుగా శక్తి దూబే  మొదటి ర్యాంకు సాధించగా, హర్షితా గోయల్  రెండవ ర్యాంకు సాధించారు. డొంగ్రే అర్చిత్ పరాగ్  మూడవ ర్యాంకు సాధించడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో సాయి శివాని 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్‌ 15వ ర్యాంకు శ్రవణ్ కుమార్ రెడ్డి 62వ ర్యాంకు, సాయి చైతన్య జాదవ్‌ 68వ ర్యాంకులు సాధించారు. 

Add Zee News as a Preferred Source

గత ఏడాది సెప్టెంబర్ 2024 రాత పరీక్ష నిర్వహించగా, ఇంటర్వ్యూలు జనవరి నుంచి ఏప్రిల్ 2025  మధ్య కాలంలో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. కేటగిరీల వారీగా చూసినట్లయితే  General - 335. EWS - 109,  ఓబీసీ- 318 , ఎస్‌సి (SC) - 160,  ఎస్‌టి (ST) - 87, బెంచ్‌మార్క్ డిసేబిలిటీలతో ఉన్నవారు మొత్తం 45 మంది ఎంపికయ్యారు. ఇకక రిజర్వ్ లిస్ట్ చూసినట్లయితే 230 మంది అభ్యర్థులు (Rule 20(4) & (5) ప్రకారం రిజర్వ్‌లో ఉంచారు. ఇదిలా ఉంటే మొత్తం ఖాళీలు 1129 ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా,ఇందులో 50 ఖాళీలు దివ్యాంగులకు (PwBD) కేటాయించారు. అభ్యర్థులకు సమాచారం కోసం UPSC Facilitation Counter, అధికారిక వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంచారు. 

Also Read: Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్‌ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?  

 ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూపీఎస్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వం సర్వీసులకు  అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీటి ద్వారానే ఐఏఎస్, ఐపీఎస్  ఇతర కేంద్ర సర్వీసులకు ఉద్యోగులను ఎంపిక చేసి వారికి సరైన శిక్షణ అందించి ఆ తర్వాత వారిని సంబంధించిన శాఖలలో సివిల్ సర్వెంట్లుగా నియమిస్తారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పెద్ద ఎత్తున సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతుండటం విశేషం.

పూర్తి అభ్యర్థుల లిస్టు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి : https://upsconline.gov.in/FR-CSM-2024-Engl-220425.pdf

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News