)
cm yogi aditnath phone call to disha patani: బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి దగ్గర ఇటీవల కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటన పెనుసంచలనంగా మారింది. ఇది జస్ట్ సాంపుల్ మాత్రమే అని మరోసారి ఒక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి.
ఈ ఘటన తర్వాత దిశాపటానీ ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా.. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ రంగంలోకి దిగారు. దిశాపటానీ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.
దిశా కుటుంబానికి ఫోన్ చేసి అదనపు భద్రత కల్పించడమే కాకుండా, కాల్పులకు కారణమైన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామంటూ భరోసా ఇచ్చారు. కాల్పుల ఘటనపై ఎంతటి వారున్న కూడా వదిలేదిలేదని స్పష్టం చేశారు. స్థానిక పోలీసులకు కూడా యూపీ సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే.. తమ కుటుంబంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ మాట్లాడారని, ఘటనపై మాట్లాడి తమకు ధైర్యం చెప్పారన్నారు. అంతే కాకుండా.. ఈ విషయాన్ని దిశాపటానీ తండ్రి జగదీష్ పటానీ స్వయంగా మీడియాతో వెల్లడించారు.
సెప్టెంబర్ 12న యూపీలోని బరేలీ పట్టణంలో దిశా పటానీ నివాసం ముందు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. తాజా సమాచారం ప్రకారం, ఈ దాడి వెనక కారణం దిశా సోదరి ఖుష్బూ పటానీ చేసిన వ్యాఖ్యలు కారణమని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటనకు కారణమంటూ యూజర్లు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారాలు తామే కారణమంటూ కూడా ఇప్పటికే పోస్ట్ చేశారు.
దీనిపై తాజాా.. దిశా సోదరి తాను అనిరుద్ధాచార్యపై మాత్రమే కామెంట్స్ చేశానని.. ప్రేమానంద్ మహారాజ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. దిశా సోదరి ఖుష్బూ పటానీ మాజీ ఆర్మీ అధికారిణి. ప్రస్తుతం ఆమె ఒక ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook