UP Govt DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల మోదీ సర్కార్ 2 శాతం డీఏ పెంపును ప్రకటించింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కేవలం 2 శాతం మాత్రమే డీను పెంచడం ఉద్యోగులకు నిరాశకు గురి చేసింది. 2 శాతం డీఏ పెంపుదలతో మొత్తం డీఏ 55 శాతానికి చేరింది. పెంచిన జీతాలను జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తరువాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా 2 శాతం డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జీతాల పెంపు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పెంపుతో యూపీ రాష్ట్ర ఉద్యోగుల డీఏ 53 నుంచి 55 శాతానికి పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR)లో 2 శాతం ఉంటుంది. "ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1, 2025 నుంచి రాష్ట్ర ఉద్యోగులకు ఇస్తున్న 53 శాతం నుంచి 55 శాతాని డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు" అని ముఖ్యమంత్రి యోగి తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన అన్నారు.
గత నెలలో మహారాష్ట్ర సర్కార్ కూడా ఉద్యోగులకు డీఏను పెంచింది. 5వ వేతన సంఘం వేతన స్కేల్ కింద ఉద్యోగులకు కరవు భత్యంలో 12 శాతం పెంపును ప్రకటించింది. దీంతో 443 శాతం నుంచి 455 శాతానికి డీఏ పెరిగింది. సవరించిన జనవరి 31, 2025 నుంచి అమలు చేయనున్నారు. ఈ నెల 4వ తేదీన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అదనంగా 2 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించారు. జనవరి 1, 2025 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించారు. డీఏ పెంపుదల వల్ల దాదాపు 17 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
READ ALSO: ఎండ వేడిమిలో డిహైడ్రేషన్‌కు గురికాకుండా నీళ్లలో ఇవి కలుపుకొని తాగండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









