Uttar Pradesh: నా అత్తలో నచ్చింది అదే..!.. అందుకే ఇద్దరం కలిసి పారిపోయాం.. యూపీ ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజం..!

Up Woman Elopes news: ఉత్తర ప్రదేశ్ లో ఇటీవల ఒక వివాహిత తనకు కాబోయే అల్లుడితో పారిపోయింది.ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే.. వివాహిత తనకు కాబోయే అల్లుడితో సంతోషంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 10, 2025, 05:20 PM IST
  • యూపీ ఘటనల్లో బిగ్ ట్విస్ట్..
  • అత్తా కోసం ఏమైన చేస్తానన్న యువకుడు..
Uttar Pradesh: నా అత్తలో నచ్చింది అదే..!.. అందుకే ఇద్దరం కలిసి పారిపోయాం.. యూపీ ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజం..!

Uttar Pradesh Married woman elopes with daughters fiancé: ఇటీవల చాలా మంది పెళ్లికి ఉన్న పవిత్రతను దెబ్బతిసేలా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది పెళ్లిచేసుకుని నూరెళ్లు కలిసి ఉంటామని అగ్ని ముందు బాసలు చేసుకుని మరీ ఎఫైర్ లుపెట్టుకుంటున్నారు. ఒకరికి తెలియకుండా, మరోకరు సీక్రెట్ యవ్వారాలు స్టార్ట్ చేస్తున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లగానే భార్యలు.. భార్యలకు తెలియకుండా.. భర్తలు తమ మాజీలతో ఎఫైర్ లుపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వీరంతా అడ్డంగా దొరికిపొయి తమ కాపురాలను చేజేతులా కూల్చుకుంటున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ప్రస్తుతం యూపీలో అనేక వరుస షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఒక వివాహిత తన భర్తను ప్రియుడి మోజులు పడి.. హత్య చేసి డ్రమ్ లో వేసింది. మరో ఘటనలో భర్త.. తన భార్యకు ఆమె ప్రియుడ్ని ఇచ్చి మరీ పెళ్లి చేశాడు. ఇక తాజాగా.. ఒక మహిళ.. తన కూతురును చూసేందుకు వచ్చిన యువకుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితోనే పారిపోయింది. ఈ ఘటన యూపీలో సంచలనంగా మారింది.

పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ లో ఇటీవల వింత ఘటన చోటుచేసుకుంది. అనితా దేవీ, జితేంద్ర భార్యభర్తలు. వీరికి పెళ్లిడుకొచ్చిన కూతురు ఉంది. దీంతో తమ కూతురుకు మంచి సంబంధం చూశాడు. కొన్నినెలల క్రితం ఒక సంబంధం చూశారు. రెండు కుటుంబాలకు ఒకరంటే మరొకరికి మ్యాచ్ బాగా నచ్చింది. పెళ్లికొడుకు రాహుల్ కు కూడా అనితాదేవీ, జితేంద్రల కూతురుకు నచ్చడంతో.. ఈ నెల ఏప్రిల్ 16న పెళ్లి డేట్ కూడా తీసుకున్నారు. మరీ రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా అయిపోయాయి.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లికూతురు తల్లి తరచుగా  తనకు కాబోయే అల్లుడితో ఎక్కువగా మాట్లాడేది. తరచుగా అతను ఇంటికి కూడా వచ్చేవాడు. తొలుత వీరు ఎలాంటి అనుమానం పడలేదు. కానీ ఏమైందో కానీ.. పెళ్లికి వారం ముందు అల్లుడితో, అత్త జంప్ అయిపోయింది. ఈ క్రమంలో దీనిపై ఇరుకుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి. తన భార్య..  కాబోయే అల్లుడితో  కలిసి..ఇంట్లోని..రూ.3.5 లక్షల నగదు, దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు తీసుకుని పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే. ఈఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇక్కడ మహిళ ప్రియుడు ఏంచెప్పాడంటే.. పెళ్లైనప్పటి నుంచి తన అత్త.. 20 ఏళ్లుగా ఎంతో నరకం అనుభవించిందని కూడా చెప్పాడు. తన అత్త పడిన కష్టాలు విని చలిపించి పోయానని, ఇకనైన ఆమెను బాగా సుఖపెట్టాలని  భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

Read more: Renu desai on Marriage: రెండో పెళ్లి అప్పుడు చేసుకుంటా..!.. మనసులో మాటబైటపెట్టిన రేణుదేశాయ్.. మ్యాటర్ ఏంటంటే..?

ఇన్నాళ్లు  చాలా నిజాయితీగా తను పడ్డ కష్టాలను తనతో షేర్ చేసుకుందని..అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకొవాలని ఇద్దరం పారిపోయామని కూడా సదరు యువకుడు చెప్పుకొచ్చాడు. పరస్పర అంగీకారంతోనే ఇద్దరం కలిసి ఉంటామని.. తమను విడదీయోద్దని కూడా సదరు యువకుడు, వివాహిత వేడుకొవడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకొవచ్చు.మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News