Holi Dispute: హోలీ పండుగ వర్సెస్ శుక్రవారం ఒకే రోజు రావడంతో ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని సున్నిత ప్రాంతాల్లో వివాదం రాజుకుంది. దీనికితోడు సంభాల్ పోలీస్ అధికారి అనూజ్ కుమార్ చౌదరి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఆ తరువాత ఇరువర్గాల మధ్య ఒప్పందంతో వివాదాస్పద 10 మసీదులకు హోలీ నాడు ముసుగులు తొడిగేందుకు పోలీసులు నిర్ణయించారు.
ఈ ఏడాది మార్చ్ 14న హోలీ పండుగ ఉంది. అదే రోజు శుక్రవారం ప్రార్ధనలు ఉన్నాయి. దాంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ మొదలైంది. ఇరువర్గాల నుంచి వచ్చిన వ్యాఖ్యలు వివాదంగా మార్చాయి. అదే సందర్భంగా సంభాల్ పోలీస్ అధికారి అనూజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సమస్యను మరింత జటిలం చేశాయి. హోలీ ఏడాదికోసారి వస్తుందని శుక్రవారం ఏడాదిలో 52 సార్లు వస్తుందని అందుకే హోలీ రంగులతో ఇబ్బంది ఉందని భావించే ముస్లింలు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ , ఎస్పీ, ముస్లిం సంఘాల నుంచి భారీగా విమర్శలు ఎదురయ్యాయి.
ఆ తరువాత రెండు వర్గాల మధ్య పరస్పరం ఒప్పందం కుదిర్చారు పోలీసులు. మార్చ్ 14వ తేదీన యూపీలోని సంభాల్‌లో హోలీ ఊరేగింపు జరిగే మార్గంలో ఉన్న జామా మసీదు సహా 10 మసీదులను ప్లాస్టిక్ షీట్లు, టార్ఫాలిన్లతో కప్పాలని పోలీసులు నిర్ణయించారు. మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసుల పహారాను పెంచుతున్నారు. గత ఏడాది ఇదే జామా మసీదు వివాదంలో నిలిచింది. ప్రాచీన హరిహర ఆలయాన్ని కూల్చి ఈ మసీదు నిర్మించాలంటూ కోర్టులో పిటీషన్ దాఖలు కావడం, కోర్టు సర్వేకు ఆదేశించడం తెలిసిందే. సర్వే సమయంలో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి.
అసలే హోలీ వర్సెస్ శుక్రవారం ప్రార్ధనలు వివాదంగా ఉంటే రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచుతున్నాయి. బీజేపీ నేత రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోలీ వేడుకల్లో అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ముస్లిం పురుషులు టార్పాలిన్లతో చేసిన హిజాబ్ ధరించాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి మసీదులకు ముసుగులు కప్పడం ద్వారా సంభాల్‌లో పరిస్థితి ఎలా నియంత్రణలో ఉంటుందనేది టెన్షన్ గా మారింది.
Also read: Ys Jagan Coterie: సాయిరెడ్డి చెప్పిన ఆ కోటరీ ఎవరు, వైవీ సుబ్బారెడ్డిని వైఎస్ ఎందుకు చేరనివ్వలేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









