)
Uttara Pradesh Floods: ఉత్తర ప్రదేశ్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అంతేకాదు వారణాసి సహా పలు చోట్ల గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ముఖ్యంగా కాశీలోని గోదౌలియా నుంచి అత్యంత ప్రముఖ ఘాట్ దశాశ్వమేధ్, షీట్లా ఘాట్ కు వెళ్లే రహదారి కూడా గంగా జలాలతో నిండిపోయింది.మృతదేహాల దహన సంస్కారాలకు హరిశ్చంద్ర ఘాట్ వద్ద స్థలం లేదు. మణికర్ణిక ఘాట్ వద్ద మృతదేహాలను పడవల ద్వారా శ్మశానవాటిక పైకప్పుకు తరలిస్తున్నారు. గంగానది ప్రమాదస్థాయి 71.262 మీటర్లకు మించి 72.03 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. గడచిన 24 గంటల్లో 57 సెంటీమీటర్ల మేర నీరు పెరిగింది. ఇదే సమయంలో వర్షాలు నిరంతరాయంగా కురుస్తున్నాయి.
ఘాట్లు, ఒడ్డున ఉన్న పలు దేవాలయాలను గంగ నీరు చుట్టుముట్టి నివాస ప్రాంతాల వైపు మళ్లింది. దీంతో పలు చోట్ల బోటు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వీధుల్లో కూడా బోట్ల మీద ప్రయాణించే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. గంగానదికి అడ్డంగా ఉన్న రామ్ నగర్ కోటలోకి కూడా నీరు చేరింది. అసి, వరుణ నదులు ఉప్పొంగడంతో అనేక కాలనీల్లోకి నీరు చేరింది.
వరదలకు లక్ష మందికి పైగా ప్రభావితులయ్యారు. బీహెచ్ యూ, అస్సీ ఘాట్ సమీపంలో ఉన్న నాగ్వా నల్లా నుంచి నీరు ప్రవేశించి రామేశ్వర్ మఠం వెనుకకు చేరుకుంది. దీంతో పాటు భగవత్ కళాశాల నుంచి సంగంపురి కాలనీ వరకు నీరు చేరింది. సోంకర్, పక్కనే ఉన్న బస్తీల్లోకి నీరు చేరడంతో 70 కుటుంబాలను గోపీరాధ విద్యాలయంలోని వరద సహాయ కేంద్రానికి తరలించారు. గంగోత్రి విహార్ కాలనీ, పరిసర ప్రాంతాలకు చెందిన 12 కుటుంబాలను శిబిరానికి తరలించారు.
సంకటమోచన్ ఆలయం వెనుక భాగంలో నాగ్వా నల్లా నుంచి నీరు చేరింది. ఈ మార్గం గుండా ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక కుటుంబాలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగితే సాకేత్ నగర్, రోహిత్ నగర్, సరైనందన్, సరైసుర్జన్, బతుపురా, దుమ్రావ్ బాగ్ కాలనీలకు నీరు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సామ్నేఘాట్ ట్రై జంక్షన్ నుంచి లంకవైపు గంగా ప్రధాన రహదారిపైకి వచ్చింది. మురుగు కాల్వ మూసుకుపోవడంతో చుట్టుపక్కల కాలనీల్లోకి నీరు చేరే ప్రమాదం ఉంది.
మరోవైపు సామ్నేఘాట్ వద్ద జ్ఞాన్ ప్రవాహ్ డ్రెయిన్‌లోని ఛానల్ గేటును పర్యవేక్షించేందుకు నీటి పారుదల శాఖ ఉద్యోగులను పెట్టారు. ఆ శాఖ కాలనీల నుంచి నీటిని బయటకు పంపడానికి పంపులను ఏర్పాటు చేసింది. జడ్జి గెస్ట్ హౌస్ కు వెళ్లే రహదారి నీట మునిగింది. జ్ఞాన్ ప్రవాహ్, పరమహంస్ ఆశ్రమం, కబీర్ మఠం, అప్నా ఘర్ ఆశ్రమం కూడా వరదల్లో చిక్కుకున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.