Uttarakhand Outburst: ఉత్తరా ఖండ్‌లో ఘోరం.. మంచులో చిక్కుకుని 50 మందికి పైగా కార్మికుల జలసమాధి..?.. వీడియో వైరల్..

Badrinath Glacier Outburst:  ఉత్తరా ఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా గడ్డకట్టిన మంచు కూలిపోవడంతో నిర్మాణ కార్మికులు దాని కింద చిక్కుకున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Feb 28, 2025, 02:54 PM IST
  • ఉత్తర ఖండ్ లో మంచు తుపాను..
  • రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ దళాలు..
Uttarakhand Outburst: ఉత్తరా ఖండ్‌లో ఘోరం.. మంచులో చిక్కుకుని 50 మందికి పైగా కార్మికుల జలసమాధి..?.. వీడియో వైరల్..

Uttarakhand Outburst News: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చమోలి- బద్రినాథ్ హైవేపై గ్లేసియర్ బరస్ట్ అయ్యింది. దీంతో మంచు పర్వత కింద చాలా మంది కార్మికులు పనుల్లో ఉన్నారు. వీరిపైన ఎత్తైన మంచు పర్వతాలు విరిగి పడటంతో భారీగా ప్రమాదం జరిగింది.పెద్ద పెద్ద మంచు గడ్డలు కరిగిపోయి.. అక్కడ నిర్మాణపనుల్లో ఉన్న కార్మికులపైన పడ్డాయి.

Add Zee News as a Preferred Source

ఈ ప్రమాదంలో 50 మందికి పైగా కార్మికులు చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. భారీగా మంచుతో కూడుకున్న రాళ్లు కింద పడ్డాయి. దాని కింద పదుల సంఖ్యలో కార్మికులు ఇరుక్కుని పోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత.. అక్కడున్న సిబ్బంది పది మంది వరకు సెఫ్టీగా బైటకు తీశారు.

 

కానీ ఇంకా 40 మందికిపైగా ఆచూకీ లభించలేదని.. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అక్కడి వారు చెప్తున్నారు. ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మొత్తంగా ఈ ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

Read more: Pune Rape Case Update: పుణే రేప్‌ కేసు నిందితుడి అరెస్ట్‌.. బస్సులో వందల కండోమ్స్‌, మహిళల లోదుస్తులు..

ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలకు గాను..  SDRF, NDRF బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మంచు ఆగకుండా కురుస్తొంది.ఇది సహాయక చర్యలకు పెద్ద ఆటంకంగా మారిందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు అధికారులు సహాయక చర్యల కోసం భారీ ఎత్తున అంబులెన్స్ లను సిద్దంగా ఉంచారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News