)
Snake Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా పాముల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా నిద్రపోతున్న ఓ వ్యక్తి పక్కన పాము పడుకుంది. అది తెలుసుకోకుండా రాత్రంతా పాముతో నిద్రపోయాడు.
ఈ సంఘటన మయూర్భంజ్ జిల్లాలోని దాహిసహి గ్రామంలో నివసిస్తున్న ఓ వ్యక్తి పక్కలోకి ఓ నాగుపాము ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన యువకుడు దెబ్బకి షాక్ అయ్యాడు. రాత్రంగా హాయితో ఆ పాముతో కలిసి నిద్రపోయాడట. ఆ తర్వాత ఉదయాన్నే నిద్ర లేచి చూడగా పక్కనే నాగుపాము ప్రత్యక్ష్యం అయ్యింది. అంతటి భయంకరమైన పామును చూడగానే ఆ కుర్రాడికి గుండె ఆగినంత పని అయిపోయింది.
ఏం జరిగిందంటే?
ఒడిశా రాష్ట్రంలోని మయూర్భంజ్ జిల్లా దాహిసహి గ్రామంలో ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎప్పటిలాగే రాత్రి కూడా తన ఇంట్లో నిద్రపోడానికి ఉపక్రమించాడు. దోమలు కుట్టకుండా దోమలతెరతో ఫ్యాన్స్ వేసుకోని హాయిగా నిద్ర పోతున్నాడు. అయితే అంతలోనే రాత్రికి అనుకోని అతిథి తన పక్కలోకి వచ్చి పడుకుంది. కానీ, ఆ విషయం అతనికి తెలియదు. ఆ అతిథి ఎవరో కాదు ఓ నాగుపాము. ఆ నాగుపాము అతనితో పాటు రాత్రంతా అదే పక్కలో పడుకుంది.
అయితే ఆ వ్యక్తి నిద్ర లేచే వరకు అతడ్ని ఎలాంటి హాని కలిగించకపోవడం గమనార్హం. అయితే ఇంతలో ఆ వ్యక్తి నిద్ర లేచే సమయానికి ఆ వ్యక్తి తన పక్కనే పడుకున్న పాముని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. అతనితో పాటు కుటుంబసభ్యులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆ పాము దాదాపుగా 8 అడుగుల పొడువు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పామును చూసి భయపడ్డ కుటుంబసభ్యులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. పాములు పట్టే వ్యక్తి వచ్చి ఎంతో జాగ్రత్తగా పామును బంధించాడు. ఆ పామును దగ్గర్లోని అడవిలో విడిచిపెట్టాడు. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook