)
Mumbai Train Masturbating: ముంబయి లోకల్ ట్రైన్లో ఘోరమైన ఘటన జరిగింది. ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలి ముందు అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వ్యక్తి చేస్తున్న అసభ్య సంజ్ఞలను కొందరు వ్యక్తులు వీడియో చిత్రీకరించారు. ఈ సంఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ముంబయి లోకల్ ట్రైన్లో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రయాణికులను ఇబ్బందికి గురిచేశాడు. ఓ మహిళా ప్రయాణికురాలి పక్కన కూర్చున్న వ్యక్తి.. అసభ్యంగా హస్తప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. దాన్ని గమనించిన ఇతరులు ఆ ఘోరాన్ని వీడియో తీయడం మొదలుపెట్టారు. వెంటనే ఆ మహిళను ఇతర ప్రయాణికులు హెచ్చరించారు. అక్కడి నుంచి వెళ్లి మరోక చోట కూర్చోండని వాళ్లు సూచించారు. ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలియజేస్తూ.. ఆమెను పక్కకి వెళ్లమని చెప్పారు.
ఆ ఘటనతో విసిగిపోయిన మహిళ అతడితో వాగ్వాదం పెట్టుకుంది. ట్రైన్ దిగే సమయానికి అతడ్ని చెంపదెబ్బ కొట్టి ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అతడ్ని తిట్టిపోస్తుంటే.. మరికొందరు అతడ్ని నిందించేందుకు ఆ వ్యక్తి హస్త ప్రయోగం చేసినట్లు ఆధారాలు లేవని వారిస్తున్నారు.
ఈ క్లిప్‌కు ప్రతిస్పందిస్తున్న ముంబయి పోలీస్.. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. ముంబయి లోకల్ రైళ్లలో గతంలోనూ ఇలాంటి కేసులు రిజిస్టర్ అయ్యాయి. మహిళలతో వారి ముందు అసభ్యంగా ప్రవర్తించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో వారి నుంచి మహిళలకు తగు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook