Absolutely gutted: మాటలు రావడం లేదు.. ఈ బాధ వర్ణనాతీతం, తొక్కిసలాటపై విరాట్ కోహ్లీ ఎమోషనల్..

Virat Kohli On Chinna swamy Stadium Stampede: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై ఎట్టకేలకు ఆర్సీబీ స్టార్‌ ప్లేయర్ విరాట్‌ కోహ్లీ స్పందించారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది RCB అభిమానులు నిన్న చనిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్ గెలవడంతో విజయోత్సవ సంబరాలకు భారీ సంఖ్యల ఆర్సీబీ అభిమానులు వచ్చారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. 

Written by - Renuka Godugu | Last Updated : Jun 5, 2025, 07:16 AM IST
Absolutely gutted: మాటలు రావడం లేదు.. ఈ బాధ వర్ణనాతీతం, తొక్కిసలాటపై విరాట్ కోహ్లీ ఎమోషనల్..

Virat Kohli On Chinna swamy Stadium Stampede: చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నిన్న 11 మంది RCB అభిమానులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రధానంగా 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ కొట్టడంతో భారీ సంఖ్యలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడానికి అక్కడికి చేరుకున్నారు. అయితే జట్టుతో కలిసి ఆనందాన్ని పంచుకునేందుకు వచ్చిన అభిమానులకు విషాదం ఎదురైంది. ఈ ఘటన యావత్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 11 మంది ఆర్సీబీ ఫ్యాన్స్‌ చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ కూడా స్పందించారు. అంతకముందే ఆర్సీబీ ఫ్రాంచైజీ చేసిన ప్రకటనను ఇన్స్టాల్ లో పోస్ట్ చేస్తూ 'మాటలు రావడం లేదు.. ఈ బాధ వర్ణనాతీతం' అని క్యాప్షన్ ఇచ్చారు. హార్డ్ బ్రేకింగ్ ఎమోజీ కూడా జోడించారు. 

Add Zee News as a Preferred Source

 అభిమానులను కోల్పోవడం కలచి వేసిందని ఆర్సీబీ అంతకుముందే తీవ్ర దిగ్భ్రాంతి గురైన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. బెంగళూరుకు జట్టు రాక నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ దురదృష్ట ఘటన కలచివేసింది. అందరి క్షేమమే మాకు ముఖ్యం ఫ్యాన్స్‌ను కోల్పోవడం బాధాకరం. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. ఘటన గురించి తెలియగానే ప్రోగ్రామ్‌ను త్వరలో ముగించాం, ప్రభుత్వ సూచనలు పాటించాం.. ఫ్యాన్స్ అందరూ సేఫ్ గా ఉండాలి అని ప్రకటించింది. 

 అసలేం జరిగింది?
ఆర్సీబీ విక్టరీ పరేడ్ చేయాలని ప్లాన్ చేసింది. ప్రధానంగా పంజాబ్ తో ఐపీఎల్ మ్యాచ్ గెలవడంతో 18 ఏళ్ల తర్వాత జరిగిన ఈ విజయాన్ని అభిమానులు భారీ ఎత్తున సెలెబ్రేట్ చేయాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌కు సన్నద్ధమైంది. అయితే తొలుత ప్రభుత్వం అనుమతికి నిరాకరించింది. సాయంత్రం విధాన సౌధ వద్ద ప్లేయర్లను సీఎం సిద్ధరామయ్య సన్మానించారు. అక్కడ స్టేడియానికి చేరుకున్నారు. విక్టరీ పరేడ్ ఉందంటూ ఆర్సీబీ ట్విట్ చేయడంతో భారీసంఖ్యలో జనం స్టేడియం వద్దకు వచ్చారు. కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం పరేడ్ లేదని చెప్పడంతో ఎలాగైనా క్రికెటర్లను చూడాలని ఫ్యాన్స్ స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

 ఘటనపై విచారణకు ఆదేశం..
 ఇక బెంగళూరు తక్కువ ఘటనపై బీజేపీ విమర్శలకు సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. కుంభమేళాలో తొక్కిసలాట జరిగినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని దీనిపై రాజకీయం చేయకూడదు అన్నారు. ఇక మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. గాయపడిన వారిని కూడా ఉచిత వైద్యం అందించనున్నారు.

హృదయ విధారక ఘటన: మోదీ 
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి మోదీ కూడా స్పందించారు. హృదయ విదారకమైన ఘటన మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుతున్న అన్నారు. వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. అయితే మరోవైపు చిన్న స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతమంది చనిపోయారో తెలిసిన వెంటనే పది నిమిషాల్లోనే వేడుకలు ముగించాం. లక్షలాది మంది రావడంతో అదుపు చేయలేకపోయమని ఆయన వెల్లడించారు.

Also Read: Glowing Skin: మెరిసే ముఖానికి ఈ 5 ఫేస్ మాస్కులు వేయాల్సిందే..

Also Read: తేనెతో ఈ మాస్క్ జుట్టుకు వేయండి.. పట్టులా మెరుస్తూ పెరుగుతుంది..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News