)
Vishal Brahma Arrest: చెన్నై విమానాశ్రయంలో రూ. 40 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు ఓ స్టార్ హీరో. అతన్ని నైజీరియన్ ముఠా ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు? డ్రగ్స్ విషయం ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏం జరిగిందంటే?
2019లో విడుదలైన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' లో చిన్న పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ సోమవారం చెన్నై విమానాశ్రయంలో రూ. 40 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలతో పట్టుబడ్డాడు.
అస్సాంకు చెందిన 32 ఏళ్ల బ్రహ్మ.. సింగపూర్ నుండి చెన్నైకి AI 347 విమానంలో తిరిగి వచ్చినప్పుడు.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అతన్ని నిషిద్ధ వస్తువులతో అడ్డుకుంది. అతన్ని నైజీరియన్ ముఠా వలలో వేసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి.
డబ్బు అవసరం కావడంతో, విశాల్‌ను సెలవుల కోసం కంబోడియాకు వెళ్లమని ప్రలోభపెట్టినట్లు సమాచారం.. కానీ అతను తిరిగి వచ్చినప్పుడు, మాదకద్రవ్యాలు ఉన్న ట్రాలీ బ్యాగ్ తీసుకెళ్లమని అతనికి సూచించారని తెలుస్తోంది.
ఈ ఆపరేషన్ వెనుక ఉన్న నైజీరియన్ ముఠాను పట్టుకోవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నందున దర్యాప్తు విస్తరించే అవకాశం ఉంది.
ఈ ఏడాది జూన్‌లో కోలీవుడ్ నటులు కృష్ణ.. శ్రీకాంత్‌లను మాదకద్రవ్యాల చట్టం కింద అరెస్టు చేశారు. జూన్ ప్రారంభంలో నైట్‌క్లబ్ ఘర్షణతో ప్రారంభమైన దర్యాప్తులో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉద్యోగ కుంభకోణం, భూ కబ్జాలకు సంబంధించిన పెద్ద సంబంధం బయటపడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook